T20 Worldcup 2021: హ్యాట్రిక్ తీసిన హసరంగ... అయినా లంకపై సౌతాఫ్రికా విజయం...

By Chinthakindhi RamuFirst Published Oct 30, 2021, 7:11 PM IST
Highlights

T20 worldcup 2021 టోర్నీలో రెండో హ్యాట్రిక్ నమోదు... హ్యాట్రిక్ తీసిన శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ... శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా...

టీ20 వరల్డ్‌కప్ 2021   టోర్నీలో రెండో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదుచేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఇది మూడో హ్యాట్రిక్ కాగా, ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇది రెండో హ్యాట్రిక్. 

15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్‌రమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన వానిందు హసరంగ, 18వ ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. 46 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ భువమా, నిశ్శంకకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆ తర్వాతి బంతికి పెట్రోరియస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు హసరంగ.... ఆ తర్వాతి బంతికి రబాడా అవుట్ కోసం అప్పీలు చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూకి వెళ్లినా బంతి అవుట్‌ సైట్ లెగ్‌కి పిచ్ అవుతుండడంతో నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...

Latest Videos

ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

2007 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదుచేశాడు బ్రెట్ లీ. ఆ తర్వాత ఆరు సీజన్లలో ఒక్క హ్యాట్రిక్ కూడా నమోదుకాలేదు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కాంపర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మూడో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు హసరంగ...

143 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికాకి శుభారంభం దక్కలేదు. రీజా హెండ్రిక్స్ 12 బంతుల్లో 11 పరుగులు చేసి ఛమీరా బౌలింగ్ ‌లో అవుట్ కాగా క్వింటన్ డి కాక్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి ఛమీరా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

must Read: ఇలా అయితే ఆ జట్లకి స్టార్ క్రికెటర్లు ఎలా దొరుకుతారు... ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీపై ఆకాశ్ చోప్రా...

ఆ తర్వాత రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఐడెన్ మార్క్‌రమ్ 20 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో అవుట్ కాగా, కెప్టెన్ తెంబ భువుమా 46 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

డ్వేన్ పెట్రోరియస్ డకౌట్ అయినా కగిసో రబాడా, డేవిడ్ మిల్లర్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. డేవిడ్ మిల్లయర్ 13 బంతుల్లో 2 సిక్సర్లతో 23 పరుగులు చేయగా రబాడా 7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు.

ఆఖరి రెండు ఓవర్లలో 25 పరుగులు రావాల్సి రావడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ రేగింది. అయితే ఛమీరా వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టాడు రబడా. ఆఖరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు ఉండగా తొలి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. అయితే వరుసగా రెండు సిక్సర్లు బాదిన డేవిడ్ మిల్లర్, విజయాన్ని ఖాయం చేసేశాడు. ఆ తర్వాత మిల్లర్ సింగిల్ తీయగా, విజయానికి 2 బంతుల్లో 1 పరుగు కావాల్సిన దశలో ఫోర్ బాది లాంఛనాన్ని ముగించాడు రబాడా...

click me!