T20 Worldcup:ఆసిస్ విజయం.. ఆనందం వ్యక్తం చేసిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్

By telugu news teamFirst Published Nov 15, 2021, 12:23 PM IST
Highlights

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా  T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా.. మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ వరుసగా 77, 53 పరుగులు చేశారు.
 

టీ20 వరల్డ్ కప్ ముగిసింది. వరల్డ్ కప్ ట్రోఫీని మరోసారి ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.  8 వికెట్ల తేడాతో. న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. కాగా.. ఆసీస్ విజయానికి ఆ జట్టు ఆల్ రౌండర్  మిచెల్ మార్ష్  కృషి చేశాడు. దీంతో.. లాస్ట్ మ్యాచ్ లో మిచెల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. కాగా..  ఈ విజయం పట్ల.. మార్ష్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా  T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా.. మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ వరుసగా 77, 53 పరుగులు చేశారు.

Also Read: T20 World Cup: వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ కు దక్కే ప్రైజ్ మనీ అంతేనా..? ఐపీఎల్ రన్నరప్ తో పోల్చినా తక్కువే..

ఇక నవంబరు 14 నాటి ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

మార్ష్‌ 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. విలియమ్సన్‌ 32 బంతులు, వార్నర్‌ 34 బంతుల్లో ఈ రికార్డు సాధించారు. అంతకుముందు 2014లో ఇండియాతో ఫైనల్‌లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(33), 2016లో వెస్టిండీస్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌(33) ఈ ఘనత అందుకున్నారు. ఇక ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా.. ఈ విజయంపట్ల మార్ష్ సంతోషం వ్యక్తం చేశారు. “నాకు మద్దతు ఇచ్చినందుకు సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. (మొదటి బంతి సిక్స్) గురించి ఆలోచించడం లేదు. అక్కడికి వెళ్లి ఉనికిని కలిగి ఉండాలనుకున్నాను. బిగ్ మార్కస్ స్టోయినిస్ ఎల్లప్పుడూ ఉనికి గురించి మాట్లాడుతుంటాడు, ”అని చెప్పాడు.

click me!