టీ20 వరల్డ్‌కప్ 2021: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్... కెప్టెన్‌గా రోహిత్ శర్మ, విరాట్‌కి విశ్రాంతి...

By Chinthakindhi RamuFirst Published Oct 20, 2021, 3:19 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి...

టీ20 వరల్డ్‌కప్ 2021లో ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మరోసారి ఛేజింగ్ చేయనుంది. నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటుండడంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...
 

విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చిన టీమిండియా, వరుణ్ చక్రవర్తి, రోహిత్ శర్మ,శార్దూల్ ఠాకూర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పించింది... ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 189 పరుగుల భారీ టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించి, విజయం అందుకుంది టీమిండియా...

కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ని కొనసాగించినా... విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. కోహ్లీ కెప్టెన్‌ కాబట్టి జట్టులో ఉండడం పక్కా, కాబట్టి సూర్యకుమార్ యాదవ్, తుదిజట్టులో ఉండాలనే నేటి మ్యాచ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే...

అలాగే బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా తొలి వార్మప్ మ్యాచ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో భువీ కంటే శార్దూల్ బెటర్ పర్ఫామెన్స్ ఇస్తే... సీనియర్ పేసర్‌కి తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే...

రాహుల్ చాహార్ ఓ వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించాడు, అశ్విన్ వికెట్లేమీ తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరి నుంచి మరింత మెరుగైన పర్ఫామెన్స్ ఆశిస్తోంది భారత జట్టు... ఇద్దరు సీనియర్ పేసర్లు విశ్రాంతి ఇవ్వడంతో నేటి మ్యాచ్‌లో ఏకంగా నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలో దిగుతోంది టీమిండియా...

భారత జట్టు: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహార్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్ 

click me!