అఫ్గాన్ క్రైసిస్: కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్..!

By telugu news teamFirst Published Sep 10, 2021, 9:40 AM IST
Highlights

ప్రపంచకప్ లో పాల్గొనే ఆప్గాన్ జట్టును ఆప్గనిస్తాన్ క్రికెట్ బోర్డు( ఏసీబీ) ప్రకటించింది.రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు.
 

ఆప్ఘనిస్తాన్  స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను టీ 20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం.  అక్టోబర్ 17 నుంచి  యూఏఈ లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రపంచ కప్ కోసం .. ఆప్గనిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. 

అదేవిధంగా ప్రపంచకప్ లో పాల్గొనే ఆప్గాన్ జట్టును ఆప్గనిస్తాన్ క్రికెట్ బోర్డు( ఏసీబీ) ప్రకటించింది.రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు.

 

🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0

— Rashid Khan (@rashidkhan_19)

‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్‌ కమిటీ, అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

click me!