టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... ఆ ఇద్దరూ లేకుండానే...

By Chinthakindhi RamuFirst Published Sep 9, 2021, 4:06 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా ఇంగ్లాండ్ జట్టు... పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో 15 మంది బృందం ఎంపిక...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫెవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ కూడా జట్టును ప్రకటించేసింది... 15 మంది ప్లేయర్లు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో కూడిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ పేరు లేకపోవడం విశేషం...

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టీమ్‌లో జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ బిల్లింగ్స్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్ వంటి భారీ హిట్టర్లకు చోటు దక్కింది.. అలాగే మొయన్ ఆలీ, సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్ వంటి ఆల్‌రౌండర్లను కూడా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కూడా ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. 

వీరిలో మోర్గాన్, జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్ వంటి కీ ప్లేయర్లు... యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పాల్గొని, టీ20 వరల్డ్‌కప్ ఆడతారు. గాయం కారణంగా క్రికెట్‌కి దూరమైన జోఫ్రా ఆర్చర్‌తో పాటు మెంటల్ హెల్త్ కోసం క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న బెన్ స్టోక్స్‌లకు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు దక్కలేదు...

టీ20 వరల్డ్‌కప్‌కి ఇంగ్లాండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ బిల్లింగ్స్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, తైమల్ మిల్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

రిజర్వు ప్లేయర్లుగా జేమ్స్ విన్స్, టామ్ కుర్రాన్, లియామ్ డాన్సన్ యూఏఈకి బయలుదేరి వెళ్లనున్నారు...

click me!