India vs Autralia: కంగారూల కంగారు.. స్పిన్నర్ల ధాటికి పేక మేడలా కూలిన టాపార్డర్..

By team teluguFirst Published Oct 20, 2021, 4:12 PM IST
Highlights

T20 world cup: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి  ఈ మ్యాచ్ లో సారథిగా కాకుండా సాధారణ ఆటగాడిగానే బరిలోకి దిగడం గమనార్హం. తాత్కాలిక సారథిగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాడు. భారత స్పిన్ బలాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో  శర్మ.. రెండో ఓవర్ నే అశ్విన్ తో  వేయించాడు.

పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 7 ఓవర్లు ముగిసేసరికి కంగారుల జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  భారత స్పిన్నర్లు అశ్విన్  ఒక ఓవర్లోనే రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక  వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం స్కోరు 7.3 ఓవర్లకు 40/3 గా ఉంది.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి  ఈ మ్యాచ్ లో సారథిగా కాకుండా సాధారణ ఆటగాడిగానే బరిలోకి దిగడం గమనార్హం. తాత్కాలిక సారథిగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాడు. భారత స్పిన్ బలాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో  శర్మ.. రెండో ఓవర్ నే అశ్విన్ తో  వేయించాడు. ఈ ఓవర్లో ఐదో బంతికి వార్నర్ (1) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాత బంతికే మిచెల్ మార్ష్ (0) ను కూడా ఔట్ చేశాడు. 

నేడు 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్న మార్ష్.. పరుగులేమీ చేయకుండానే స్లిప్స్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  నాలుగో ఓవర్ వేసిన రవీంద్ర జడేజా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (8) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే అతడు.. ఎల్బీడబ్ల్యూగా వెనురదిరిగాడు. 

స్కోరు బోర్డుపై పదిహేను పరుగులు కూడా చేరకుండానే కంగారూ ఆటగాళ్లు వార్నర్, ఫించ్, మార్ష్ ల వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం గ్లెన్ మ్యాక్స్వెల్ (4), స్టీవెన్ స్మిత్ (4) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి ఆచితూచి ఆడుతున్నారు.  ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో కోహ్లి బౌలింగ్ చేయడం గమనార్హం. 

ఇదిలాఉండగా.. ఈ మ్యాచ్ కోసం జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చిన టీమిండియా, వరుణ్ చక్రవర్తి, రోహిత్ శర్మ,శార్దూల్ ఠాకూర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. 

click me!