T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 26, 2024, 10:59 AM IST

T20 World Cup 2024, Semi-Final : గురువారం (జూన్ 27) గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. 
 


T20 World Cup 2024, Semi-Final :  వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న భార‌త క్రికెట్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీని అందుకోవ‌డానికి మ‌రో రెండు అడుగుల దూరంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఓట‌మి లేకుండా భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. గురువారం (జూన్ 27) గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను వర్షం దెబ్బ‌కొట్టే అవ‌కాశ‌ముంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు (IST రాత్రి 8 గంటలకు భార‌త్ లో) ప్రారంభం కానుంది. అయితే, వర్షం పడితే ఏమవుతుందనేది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న.. ! 

సెమీ ఫైన‌ల్ పై భారీ వర్షం కురిసే అవకాశం

Latest Videos

undefined

ఆక్యూ వెద‌ర్ రిపోర్టుల ప్రకారం.. గయానాలో గురువారం ఉదయం 88% వర్షం, 18% ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచబడింది కానీ, భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తే, ఫలితం పొందడానికి ప్రయత్నించడానికి అదనంగా 250 నిమిషాల అదనపు సమయం ఇవ్వ‌నున్నారు. 

మ్యాచ్ రద్దు అయితే ఏమవుతుంది?

అద‌ర‌న‌పు స‌మ‌యంలో కూడా మ్యాచ్ ఆడ‌టం కుద‌ర‌క‌పోతే ఏమ‌వుతుంది? ఒక్క బంతి కూడా వేయకుండానే వర్షం కార‌ణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తే, సెమీ ఫైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇదే జరిగితే సూపర్-8 రౌండ్‌లో భారత్ తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది కాబ‌ట్టి భార‌త జ‌ట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ అభిమానులు గుండెలు ప‌గిలిపోతాయ్ కావ‌చ్చు.. ఇంగ్లిష్ జట్టు మ‌రోసారి ట్రోఫీని గెలుచుకోలేకపోతుంది. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలన్న వారి కల చెదిరిపోతుంది.

భారత్‌, దక్షిణాఫ్రికా నంబర్‌-1గా ఉన్నాయి..

సూపర్-8 గ్రూప్ 1లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో, బంగ్లాదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. మరోవైపు గ్రూప్-2లో దక్షిణాఫ్రికా నంబర్‌వన్‌గా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌తో సెమీ ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది. బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా ఆఫ్ఘన్ జట్టు బంగ్లాదేశ్‌ను మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాను కూడా టోర్నీ నుంచి ఔట్ చేసింది. వ‌ర్షం కార‌ణంగా రెండు సెమీ ఫైన‌ల్స్ ర‌ద్దు అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ విజ‌యాల‌తో ఉన్న భార‌త్, సౌతాఫ్రికాలు ఫైన‌ల్ కు చేరుకుంటాయి. ఫైన‌ల్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే, ఇరు జ‌ట్ల‌ను విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారు.

click me!