IND vs SA T20 World Cup 2024 final: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ ఛాంపియన్ ఎవరు అనే ఉత్కంఠతో నిండిపోయింది. అయితే, ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
IND vs SA T20 World Cup 2024 final: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ పోరులో జూన్ 29న భారత్ తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ లవర్స్ కు టైటిల్ పోరు మరింత మజాను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి ఫైనల్ కు చేరుకున్న సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ ఆకలిని తీర్చుకోవాలని చూస్తుండగా, ఐసీసీ వన్డే 2023 ట్రోఫీని అడుగుదూరంలో కోల్పోయిన టీమిండియా ఈ సారి అలాంటి పరిస్థితిలోకి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ప్రాక్టీస్ సెషన్ రద్దు..
ఐసీసీ టీ20 ప్రంపంచ కప్ 2024 ఫైనల్‌కు ముందు టీమిండియాకు సంబంధించి ఐసీసీ అధికారికంగా కొన్ని అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు విలేకరుల సమావేశం ఉండదని అందులో పేర్కొంది. దీంతో పాటు భారత జట్టు తన ప్రాక్టీస్ సెషన్‌ను కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. జూన్ 27న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైనప్పటికీ భారత జట్టు అద్భుత విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
భారత జట్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఐసీసీ వర్గాల ప్రకారం.. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు బార్బడోస్‌కు బయలుదేరే ముందు టీమిండియా విలేకరుల సమావేశం జరిగింది. ఏది ఇంకా విడుదల కాలేదు. ఇది కాకుండా, మిగిలిన ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రాక్టీస్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌కు బదులు విశ్రాంతి తీసుకోవాలని భారత జట్టు నిర్ణయించింది. మరోవైపు దక్షిణాఫ్రికాకు సంబంధించి ఐసీసీ కూడా సమాచారం ఇచ్చింది.
దక్షిణాఫ్రికా మీడియా సమావేశం..
జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టు ప్రతి విషయాన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తుంది. మ్యాచ్‌కు ముందు, జట్టు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. కెన్సింగ్టన్ ఓవల్‌లో ప్రాక్టిస్ సెషన్ లో కూడా పాల్గొననుంది. దక్షిణాఫ్రికా చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఇరు జట్లు ఈ టీ20 ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో ఏ జట్టు మెగా ట్రోఫీ గెలుచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
23 ఫోర్లు, 8 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన భారత క్రికెటర్ షఫాలీ వర్మ