T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. రిషబ్ పంత్ మినహా ఇతర ప్లేయర్లు ఏవరూ రాణించలేకపోవడంతో భారత్ 119 పరుగులకు ఆలౌట్ అయింది.
T20 World Cup 2024, IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2024 లో హై ఓల్టేజీ మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ లు న్యూయార్క్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగింది. రిషబ్ పంత్ మినహా ఇతర ప్లేయర్లు ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. పాకిస్తాన్ సూపర్ బౌలింగ్ తో 119 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది.
మరోసారి భారత జట్టు స్లార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రారంభించారు. ఇద్దరు మంచి టచ్ లో కనిపించారు. రోహిత్ శర్మ తొలి బంతికే రెండు పరుగుల చేసి భారత స్కోర్ బోర్డును ప్రారంభించాడు. ఆ తర్వాత సిక్సుతో బాది మరింత ఊపుతో కనిపించాడు. తొలి ఓవర్ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ కొద్ది సేపు నిలిచిపోయింది. వర్షం ఆగడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభం అయింది. రెండో ఓవర్ ను విరాట్ కోహ్లీ ప్రారంభించాడు. తన తొలి బంతికే ఫోర్ కొట్టి తన దూకుడును ప్రదర్శించాడు. అయితే, మరోసారి మరో షాట్ ఆడబోయే క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. నషీమ్ షా బౌలింగ్ తో భారీ షాట్ కొట్టబోయిన విరాట్ కోహ్లీకి కనెక్షన్ కుదరకపోవడంతో ఉస్మాన్ ఖాన్ కు దొరికిపోయాడు. 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
undefined
మరో ఎండ్ లో రోహిత్ శర్మ మంచి షాట్స్ ఆడుతూ దూకుడు ప్రదర్శించాడు. అయితే, మరోసారి భారీ సిక్సర్ కొట్టబోయాడు... అయితే, బౌండరీలైన్ వద్ద క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో భారత్ మూడో ఓవర్ లోనే 19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలోకి జారుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్ల అందరూ ఒత్తిడిలోకి జారుకుని వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఒక్క రిషబ్ పంత్ మాత్రమే తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుని 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో ముందుకు వచ్చి కొద్ది సేపు క్రీజులో ఉండి జట్టుకు ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముందుకు జరిగి పెద్ద షాట్ ఆడబోయే క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఏదేమైనా అక్షర్ పటేల్ ఆడిన 20 పరుగుల ఇన్నింగ్స్ భారత్ స్కోర్ బోర్డులో కీలకంగా మారింది. అయితే, ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ నెంబర్ వన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని శివమ్ దూబే ఉపయోగించుకోలేక పోయాడు. ఒత్తిడితో 3 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా, బుమ్రాలు డకౌట్ అయ్యారు.
హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయాడు. 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అర్ష్ దీప్ సింగ్ 9 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. సిరాజ్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పాక్ సూపర్ బౌలింగ్ తో టీమిండియా 19 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నషీమ్ షా 3, హరీష్ రావుఫ్ 3 వికెట్లు తీసుకున్నారు. మహ్మద్ అమీర్ 2, షాహీన్ అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నాడు.