టీమిండియా కెప్టెన్‌ను గుర్తుపట్టని క్యాబ్ డ్రైవర్... రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో వింత అనుభవం...

By Chinthakindhi RamuFirst Published Oct 16, 2022, 1:31 PM IST
Highlights

ఐసీసీ మీడియా ఈవెంట్‌ తర్వాత క్యాబ్‌లో హోటల్‌కి వెళ్లిన రోహిత్ శర్మ... హిట్ మ్యాన్‌ని గుర్తుపట్టని క్యాబ్ డ్రైవర్...

2007 టీ20 వరల్డ్ కప్‌ నుంచి 2022 టోర్నీ వరకూ ఆడుతున్న ఇద్దరిలో రోహిత్ శర్మ ఒకడు. 8వ సారి ఈ మెగా టోర్నీ ఆడుతున్న రోహిత్‌, మొట్టమొదటిసారి కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. ఐసీసీ నిర్వహించిన కెప్టెన్స్ డే ఈవెంట్‌లో మిగిలిన 15 జట్ల కెప్టెన్లతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు రోహిత్ శర్మ...

ఐసీసీ ఈవెంట్‌ని పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, క్యాబ్ ఎక్కి హోటెల్‌కి చేరుకున్నాడు. అయితే ఈ సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్, టీమిండియా కెప్టెన్‌ని గుర్తు పట్టకపోవడం విశేషం. సెక్యూరిటీ సిబ్బంది హడావుడిగా రోహిత్ శర్మను క్యాబ్ ఎక్కించడంతో ఆశ్చర్యపోయిన ఆ క్యాబ్ డ్రైవర్... ‘నువ్వు ఏం పని చేస్తావ్?’ అంటూ ప్రశ్నించాడు... దానికి రోహిత్ శర్మ ‘నేను ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

And have the footage of to prove it. pic.twitter.com/3EKpqwDbGF

— Daniel Cherny (@DanielCherny)

రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. గత 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకి ముందు ఐపీఎల్ 2022లో గాయపడిన రోహిత్ శర్మ ఆలస్యంగా టీమ్‌తో కలిశాడు. వన్డే, టీ20 సిరీసుల్లో ఆడని రోహిత్ శర్మ, ఆఖరి రెండు టెస్టు మ్యాచులు ఆడాడు...  అయినా రోహిత్ శర్మను గుర్తుపట్టకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫోటో షూట్ సమయంలో భారత  జట్టు కెప్టెన్ రోహిత్ శర్మని ఓ మూలన కూర్చోబెట్టి అవమానించింది క్రికెట్ ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్ కప్ 2019 సమయంలో నిర్వహించిన ఫోటో షూట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సైడ్‌కే కూర్చున్నా అతని కోసం స్పెషల్ ఛైర్ వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు భారత సారథికి రోహిత్ శర్మకు ఛైర్ వేయలేదు సరికదా కూర్చోవడానికి ఓ ఐస్ బాక్స్ ఇవ్వడం హిట్ మ్యాన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 23న దాయాది పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి సంబంధించి ఇప్పటికే 90 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచులు ఆడబోతోంది భారత జట్టు...

click me!