ICC T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ను టీవీలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ వేదికగా చూడబోయే కోట్లాది మంది అభిమానులకు వినిపించే కామెంటేటర్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది.
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మొదలైంది. నేటి నుంచి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆటను టీవీలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ వేదికగా చూడబోయే కోట్లాది మంది అభిమానులకు వినిపించే కామెంటేటర్స్ (వ్యాఖ్యాతలు) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయ వ్యాఖ్యాతలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూద్దాం.
టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులను 20 మందిని ఎంపిక చేయగా అందులో భారత్ నుంచి ముగ్గురు చోటుదక్కించుకున్నారు. వారిలో ఒకరు ఇండియా 2007 టీ20 ప్రపంచకప్ తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన క్షణాలతో పాటు ఆయన కామెంట్రీని ఎప్పటికీ మరిచిపోరు. ఆయనే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
రవిశాస్త్రితో పాటు భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా కామెంట్రీ వినిపించనున్నాడు. ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు క్రికెట్ కామెంట్రీ స్థాయిని పెంచి అసలు కామెంటేటర్స్ కు కూడా అభిమానులు ఉంటారు.. అని అభిమానం సంపాదించుకున్న హర్షా భోగ్లేను కూడా ఐసీసీ, టీ20 ప్రపంచకప్ కు కామెంటేటర్ గా నియమించింది.
భారత్ నుంచి ఈ ముగ్గురిని నియమించగా కొద్దిరోజుల క్రితమే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ స్టార్ ఆటగాడు నీల్ ఓబ్రెన్, పీటర్ మోమ్సేన్ లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 20 మంది కామెంటేటర్ల జాబితాలో మెల్ జోన్స్, ఇసా గుహ, నటాలీ జెర్మనోస్ లు మహిళా వ్యాఖ్యాతలుగా చోటు దక్కించుకున్నారు.
What an elite commentary line-up for 2022 😍
Details 👉 https://t.co/sCOReFrnTH pic.twitter.com/CuTJlwBeOk
మొత్తం జాబితా ఇదే..
ఆడమ్ గిల్‌క్రిస్ట్, అథర్ అలీ ఖాన్, బాజిద్ ఖాన్, బ్రేన్ ముర్గత్రయోడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డేల్ స్టెయిన్, డానీ మోరిసన్, డిర్క్ నేన్స్, ఇయాన్ మోర్గాన్, హర్షా భోగ్లే, ఇయాన్ బిషష్, ఇయాన్ స్మిత్, ఇసా గుహా, మార్క్ హార్వర్డ్, మెల్ జోన్స్, మైఖేల్ అథర్టన్, మైకేల్ క్లార్క్, నాసిర్ హుస్సేన్, నటాలీ జర్ననోస్, నీల్ ఓబ్రెయిన్, పామి ఎంబాగ్వా, ప్రెస్టన్ మోమ్సేన్, రవిశాస్త్రి, రసెల్ ఆర్నాల్డ్, సామ్యూల్ బద్రి, షేన్ వాట్సన్, షాన్ పొలాక్, సైమన్ డౌల్, సునీల్ గవాస్కర్
Road to the 2022 🏆 starts now! pic.twitter.com/xv51p9a1lb
— ICC (@ICC)