2022 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ షార్ట్ లిస్టులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్... పాక్ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఆదివారం పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ విజేత ఎవరో తేలిపోనుంది. 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్ జట్లు టీ20 వరల్డ్ కప్ గెలిచాయి. దీంతో ఈసారి ఏ జట్టు గెలిచినా వారికిది రెండో టీ20 వరల్డ్ కప్ కానుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను నిర్ణయించే బాధ్యత, ప్రేక్షకులకే అప్పగించింది ఐసీసీ...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన 9 మంది ప్లేయర్లను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసింది ఐసీసీ. వీరిలో అత్యధిక ఓట్లు సంపాదించిన వారికి ఈ అవార్డు వరించనుంది. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డుకు షార్ట్ లిస్ట్ కాగా పాకిస్తాన్ నుంచి షాదబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదీ.. ఇంగ్లాండ్ నుంచి సామ్ కుర్రాన్, జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయ్యారు...
undefined
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజాతో పాటు శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కూడా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయ్యారు.
పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 6 మ్యాచుల్లో 98.67 సగటుతో 296 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్ 6 మ్యాచుల్లో 59.75 సగటుతో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 189.68 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన సూర్య, టోర్నీలో అత్యధిక స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...
6 మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన షాదబ్ ఖాన్, బ్యాటుతోనూ రాణించి పాక్‌కి విజయాలు అందించాడు. అలాగే గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన షాహీన్ ఆఫ్రిదీ 10 వికెట్లు తీసి పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...
ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ 5 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలెక్స్ హేల్స్ 5 మ్యాచుల్లో 211 పరుగులు చేసి ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...
ఆరంభంలో పరుగుల చేయడానికి ఇబ్బంది పడిన జోస్ బట్లర్, 5 మ్యాచుల్లో 199 పరుగులు చేశాడు. సికందర్ రజా అద్భుత పోరాటంతో 8 మ్యాచుల్లో 219 పరుగులు చేయడమే కాకుండా 10 వికెట్లు తీసి... జింబాబ్వే జట్టు సూపర్ 12 రౌండ్ చేరడంలో ముఖ్య భూమిక పోషించాడు...
గత టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ ఈసారి కూడా 8 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. టాప్ 6లో ఉన్న బౌలర్లు ఎవ్వరూ ఫైనల్ ఆడడం లేదు. ఆఫ్రిదీ, షాదబ్ ఖాన్, సామ్ కుర్రాన్‌లలో ఎవరైనా ఆఖరి మ్యాచ్‌లో 6 వికెట్లు తీస్తేనే... హసరంగ రికార్డును అధిగమించగలుగుతారు...
ఐసీసీ వెబ్‌సైట్‌లో మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 కింద... వోటింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని నొక్కితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కనబడుతుంది. అందులో మీకు నచ్చిన ప్లేయర్లకు ఓటు వేయొచ్చు. అయితే ఓటు వేయాలంటే జీమెయిల్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది...
ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగే వరకూ ఈ ఓటింగ్ జరుగుతుంది. ఈ లింకు ద్వారా మీకు నచ్చిన ప్లేయర్‌ని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విజేతగా నిలపండి. https://www.icc-cricket.com/awards/player-of-the-tournament