T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో రెండు వరుస విజయాలు అందుకుని సెమీస్ రేసులో నిలిచిన భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో కీలక పోరులో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే..
పొట్టి ప్రపంచకప్ లో వర్షం పుణ్యమా అగ్రశ్రేణి జట్లు ఆడే మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. టోర్నీ ప్రారంభంలో భారత్ - పాకిస్తాన్ తర్వాత అగ్రశ్రేణి జట్లలో ఆ స్థాయి ఆట ఆడిన మ్యాచ్ మరొకటి లేదు. కానీ నేడు ఆ కొరత తీర్చేందుకు భారత్ - దక్షిణాఫ్రికాలు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు కలిసి టీ20 ప్రపంచకప్ లో తాడో పేడో తేల్చుకోనున్నాయి. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు రానుంది.
ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాను మూడు టీ20ల సిరీస్ లో 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. బలాబలాల పరంగా రెండు జట్లు సమానంగా ఉన్నాయి. భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టులో
బ్యాటింగ్ లో భారత్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లతో దుర్బేధ్యంగా కనబడుతున్నది. అయితే ఓపెనింగ్ సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ లలో కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో అయినా రాహుల్ ఆడతాడో లేదో చూడాలి. బ్యాటింగ్ లో జోరు మీదున్న టీమిండియా.. బౌలింగ్ లో కూడా మెరుగ్గానే ఉంది. బుమ్రా లేకున్నా భువనేశ్వర్, షమీ తో పాటు యువ అర్ష్‌దీప్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు.
సౌతాఫ్రికా కూడా ఏం తక్కువ తిన్లేదు. ఈ టోర్నీలో జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లలో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ జోరు చూపించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రిలీ రొసోవ్ సెంచరీ బాదాడు. వీరికి తోడు మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్ లతో పాటు కేశవ్ మహారాజ్ కూడా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ లో కూడా ఆ జట్టు.. రబాడా, ఎంగిడి, నోర్త్జ్, కేశవ్ మహారాజ్ లతో బలంగా ఉంది. భారత బ్యాటర్లను సఫారీ బౌలింగ్ దళం ఏ మేరకు నియంత్రిస్తుందో వేచి చూడాలి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా మీద భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇరు జట్లు ఇదివరకు 5 సార్లు తలపడగా.. నాలుగు సార్లు భారత్ గెలవగా ఒక్కసారి మాత్రమే సౌతాఫ్రికా నెగ్గింది.
🚨 Toss & Team News from Perth 🚨 has won the toss & have elected to bat against South Africa. |
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6
1⃣ change to our Playing XI as is named in the team 🔽 pic.twitter.com/X9n5kLoYNn
తుది జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా : టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రొసోవ్, మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్త్జ్, లుంగి ఎంగిడి, కగిసో రబాడా