Suryakumar Yadav: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కెప్టెన్సీ వివాదం మధ్య టీమిండియా స్టార్, ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ సందర్భంగా గాయపడిన సూర్యకుమార్.. ఆ తర్వాత బ్యాట్ పట్టలేదు.
Suryakumar Yadav Heart Breaking Post: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా అనేక మార్పులు చేసిన ముంబై రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం హాట్ టాపిక్ గా మారింది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కెప్టెన్సీ వివాదం మధ్య ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పోస్టు వైరల్ గా మారింది. ఐపీఎల్ 2024 ప్రారంభానికి రోజుల ముందు సూర్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. హార్ట్ బ్రేక్ ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేయడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఎం చెప్పదలచుకున్నాడనీ, అర్థం ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, రోహిత్ శర్మ శిక్షణ కోసం ముంబై ఇండియన్స్ శిబిరానికి రావడం గురించి అభిమానులు చర్చించుకుంటున్న సమయంలో సూర్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. గాయం కారణంగా రెండు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇంకా ముంబై ఇండియన్స్ శిబిరానికి చేరుకోలేదు. గాయం తీవ్రత తగ్గలేదనీ, రాబోయే ఐపీఎల్ 2024లో ఆడటం కష్టమేననే రిపోర్టుల మధ్య సూర్య హార్ట్ బ్రేక్ స్టోరీ.. అతను రాబోయే ఐపీఎల్ ఆడడనే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నట్టుగా ఉంది.
IPL 2024 లో కొత్త రూల్.. స్మార్ట్ రీప్లే సిస్టమ్ అంటే ఏమిటో తెలుసా?
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యకుమార్‌కు ఇంకా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదనీ, 24న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడలేడని గతంలో వార్తలు వచ్చాయి. సూర్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇదే అంటున్నారు అభిమానులు. దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ సందర్భంగా గాయపడిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడలేదు. అలాగే, గాయపడిన తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టలేదు.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉండడాన్ని జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లతో సహా సీనియర్ ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా, 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ శిబిరానికి చేరుకున్నాడు. రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసింది.
IPL 2024 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్.. !