'పాకిస్థాన్ స్మోకింగ్ లీగ్..' పీఎస్ఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మ‌ధ్య‌లోనే పాక్ స్టార్ ప్లేయ‌ర్ స్మోకింగ్.. వీడియో

By Mahesh Rajamoni  |  First Published Mar 19, 2024, 5:22 PM IST

Imad Wasim : కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫైనల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ గెలుపుతో మూడో పీఎస్ఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ జ‌రుతుండ‌గానే ఇమాద్ వ‌సీ స్మోకింగ్ చేయ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.
 


PSL 2024 Final - Imad Wasim : పాకిస్థాన్ సూపర్ లీగ్  (పీఎస్ఎల్ 2024) ఫైనల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా పాక్ స్టార్ ప్లేయ‌ర్ ధుమ‌పానం (స్మోకింగ్) సేవించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ కావ‌డంతో అత‌నితో పాటు పాక్ ఆట‌గాళ్లు, బోర్డుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్‌ల మధ్య టైటిల్ పోరులో పాకిస్థాన్ ఆటగాడు ఇమాద్ వసీం డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని పొగ తాగాడు. ముల్తాన్ సుల్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఇమాద్ వసీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు కూడా ఇదేనా పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అనే ప్రశ్నతో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన ఇమాద్ వాసిమ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ముల్తాన్ సుల్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తర్వాత ఇమాద్ వాసింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. చివరి మూడు ఓవర్లలో, ఇమాద్ వసీమ్‌కు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ వచ్చాడు. ఇమాద్ వసీమ్ మైదానం వీడే సమయానికి ముల్తాన్ సుల్తాన్ 17 ఓవర్లలో 127-9తో ఉంది. ముల్తాన్ సుల్తాన్స్ చివరి ఓవర్‌లో 18 పరుగులతో సహా చివరి వికెట్‌లో 32 పరుగులు చేసి 159 పరుగులకు చేరుకుంది.

Latest Videos

undefined

IPL 2024: రిషబ్ పంత్‌కి ఇది కష్టమే... సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ !

35 ఏళ్ల ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, అయితే ఈ సీజన్లో పీఎస్ఎల్ లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత మ‌ళ్లీ రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ జ‌ట్టులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తిరిగి వస్తాడని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అత‌న్ని స్మోకింగ్ వివాదం చుట్టుముట్టింది. షాదాబ్ ఖాన్ నేతృత్వంలోని ఇస్లామాబాద్ యునైటెడ్ జ‌ట్టు సోమ‌వారం జ‌రిగిన పీఎస్ఎల్ ఫైనల్ చివరి బంతికి హునైన్ షా బౌండరీ సహాయంతో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. దీంతో ఆ టీమ్ మూడో పీఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

 

WTF ??
IMAD WASIM SMOKING
After taking Fifer pic.twitter.com/IBt7rFLEiV

— Qaree (@Bunny420420)

IPL 2024 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు బిగ్ షాక్.. !

click me!