Suryakumar Yadav: వ‌చ్చేశాడు.. అద‌ర‌గొడుతానంటున్న ముంబై సూప‌ర్ స్టార్.. !

By Mahesh Rajamoni  |  First Published Apr 5, 2024, 7:41 PM IST

Mumbai Indians : ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ ను వ‌రుస ఓట‌ములు వెంటాడుతున్నాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాద‌వ్ సేవ‌లు ముంబైకి జ‌ట్టుకు చాలా అవ‌స‌ర‌మ‌ని భార‌త సీనియ‌ర్లు పేర్కొంటున్నారు.
 


Suryakumar Yadav : వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు గుడ్ న్యూస్ అందింది. టీ20 నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్, ముంబై స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టులో చేరాడు. ఇక ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ ముంబై విజ‌య‌ప‌థంలోకి తీసుకువ‌స్తానంటున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభ‌మైన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఆడిన మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలు కావ‌డం, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణ‌యాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శ‌ర్మ కు మళ్లీ కెప్టెన్సీ ఇస్తానంటున్న నో చెబుతున్నాడ‌నే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. దీంతో ముంబై స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌చ్చేదెన్న‌డూ అని అభిమానులు భావిస్తున్న త‌రుణంలో గుడ్ న్యూస్ అందింది.

టీ20 క్రికెట్ నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ముంబై జ‌ట్టుతో చేరాడు. ఐపీఎల్ 2024 లో ముంబై త‌మ 4వ‌ మ్యాచ్‌కు ముందు వారి స్టార్ బ్యాటర్‌లలో ఒకరు తిరిగి జట్టులోకి రావడంతో ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రారంభానికి ముగింపు వుండ‌వ‌చ్చు. సూర్యకుమార్ యాదవ్ తన గాయం నుండి పూర్తిగా కోలుకునీ, ఫిట్ నెస్ క్లియ‌రెన్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జరగబోయే మ్యాచ్‌కు సన్నాహకంగా ముంబై స్క్వాడ్‌లో తిరిగి చేరాడు. కాగా, సూర్యకుమార్ చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్ నుండి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. ఏప్రిల్ 3న బీసీసీఐ, ఎన్సీఏ ఫిజియోల ప‌రిశీల‌న త‌ర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో పాల్గొనేందుకు మెడికల్ క్లియరెన్స్ ను సూర్య‌కుమార్ యాద‌వ్ పొందాడు.

Latest Videos

రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా సామి.. !

కెప్టెన్సీ వివాదం, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ నిర్ణ‌యాలు.. టీమ్ లోని ప్లేయ‌ర్ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ‌ల‌తో ముంబై ఇండియ‌న్స్ ఈ సీజ‌న్ లో ఆడిన మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మిపాలైంది. సూర్య‌కుమార్ యాద‌వ్ రాక‌తోనైనా ఇప్పుడు టీమ్ గెలుపు మార్గంలోకి వ‌స్తుందేమో చూడాలి. ప్రస్తుతం, ఏప్రిల్ 7న వాంఖడే స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌కు ముందు జట్టు జామ్‌నగర్‌లో విరామం తీసుకుంటోంది.

డ్రెస్సింగ్ రూమ్ లో బాగులేదు.. ముంబై ఇండియ‌న్స్ కు రోహిత్ శ‌ర్మ గుడ్ బై !

 

click me!