Mumbai Indians : ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో ఏమాత్రం బాగోలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.
Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడం, ఆ తర్వాత ఛాంపియన్ ప్లేయర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం తీవ్ర వివాదం రేపింది. ఇక ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ముంబై ఆడిన మూడు మ్యాచ్ లలో ఓటమి పాలు కావడం, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత మీడియా నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2024 కోసం పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీసుకున్న నాయకత్వ నిర్ణయాలపై ముంబై ఇండియన్స్ (ఎంఐ) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో ముంబై పేలవమైన ప్రదర్శన, ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ లోని పరిస్థితులు అంతబాగా లేకపోవడంతో ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ముంబైని విడిచిపెట్టే అవకాశముందని సంబంధిత నివేదికలు (News 24 Sports -Vaibhav Bhola) పేర్కొంటున్నాయి.
ఎవరీ శశాంక్ సింగ్.. పొరపాటున టీమ్ లోకి వచ్చి.. మొత్తం మార్చిపడేశాడు.. !
సంబంధిత రిపోర్టుల ప్రకారం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని ఒక ఎంఐ ప్లేయర్ తెలియజేసాడు, ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చీలికకు కారణమైంది. లీగ్ పట్టికలో రాక్ బాటమ్‌లో ఉన్న జట్టుపై విమర్శలు చుట్టుముట్టడంతో ముంబైకి అనుకూలంగా ఫలితాలు రాకపోవడం మరింత దారుణంగా మారింది. కెప్టెన్సీ నిర్ణయాల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా వాదనలు నడిచాయి. ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హోమ్ గేమ్‌తో పాటు అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు ఐపీఎల్ గేమ్‌లలో ఓడిపోయింది.
ఇదిలావుండగా, హార్దిక్ నుంచి మళ్లీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే, రోహిత్ మళ్లీ ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేడని సమాచారం. ఇదే సమయంలో ఈ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ ముంబైని విడిచి వేలంలోకి రావాలని రోహిత్ నిర్ణయం తీసుకుంటున్నాడనే వార్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాబోయే ఐపీఎల్ వేలంపై ఇప్పటి నుంచే మరింత ఆసక్తిని పెంచుతుతోంది.
'గిల్' మాంగే మోర్.. బౌండరీల వర్షం.. ఏం షాట్స్ గురూ.. అదిరిపోయింది !
హార్దిక్ పై ముంబై ఫ్యాన్స్ మండిపడుతూనే ఉన్నారు. ముంబై జరుగుతున్న ప్రతిమ్యాచ్ లో అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగిండం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వరుస ఓటముల నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ విషయంపై కూడా చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మరోసారి రోహిత్ శర్మకు జట్టుకు కెప్టెన్సీ ఇవ్వాలని చేస్తోంది. రోహిత్ శర్మ మాత్రం మొత్తంగా ముంబై జట్టుకే దూరం కావవాలని చూస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మరింది.
రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా నాయనా.. !