Suryakumar Yadav: భారత స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించాడు.
Suryakumar Yadav: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ మరో ఘనత సాధించారు. సూర్య కుమార్ యాదవ్ టీ-20 క్రికెట్‌లో రెండు వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 15 పరుగులు చేసి భారీ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. సూర్యకుమార్ 56వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లో 2000 పరుగుల మార్కును దాటేందుకు విరాట్ కోహ్లీ 56 ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాగా.. అతి తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ పేరిట పెద్ద రికార్డు నమోదైంది. 1163 బంతుల్లో రెండు వేల పరుగులు చేశాడు.
టీ20లో వేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడు వీళ్లే..
56-విరాట్ కోహ్లీ
56 – సూర్యకుమార్ యాదవ్*
58- కేఎల్ రాహుల్
కాగా, ఓవరాల్ టీ-20లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. ఇద్దరు ఆటగాళ్లు 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.
T20Iలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేసిన ఆటగాళ్లు
52- బాబర్ ఆజం
52-మహమ్మద్ రిజ్వాన్
56-విరాట్ కోహ్లీ
56 – సూర్యకుమార్ యాదవ్*
58- కేఎల్ రాహుల్
టీ-20లో రెండు వేల పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు.
భారత్ తరఫున టీ-20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
4008 – విరాట్ కోహ్లి (107 ఇన్నింగ్స్)
3853 – రోహిత్ శర్మ (140)
2256 – KL రాహుల్ (68)
2041 – సూర్యకుమార్ యాదవ్ (56)
సూర్య కుమార్ హాఫ్ సెంచరీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ దూకుడుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. తబ్రేజ్ షమ్సీ వేసిన బంతికి మార్కో జాన్సెన్ క్యాచ్ ఇచ్చాడు.