RCB vs SRH : త‌న రికార్డును తానే బ్రేక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

By Mahesh Rajamoni  |  First Published Apr 15, 2024, 10:22 PM IST

IPL 2024 RCB vs SRH : చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాళ్లు ఈ సీజ‌న్ లో మరోసారి విధ్వంసం సృష్టించారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ దుమ్మురేపే ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జ‌ట్టుగా హైదరాబాద్ ఘ‌నత సాధించింది. 
 


IPL 2024 RCB vs SRH : ప‌రుగుల సునామీ.. బీభ‌త్సం.. విధ్వంసం.. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియలో ఇదే జ‌రిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయ‌ర్ల దండ‌యాత్ర‌తో రికార్డుల మోత మోగింది. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. దీంతో హైద‌రాబాద్ టీమ్ త‌న రికార్డును తాను 19 రోజుల్లోనే తిర‌గ‌రాసింది. ట్రావిస్ హెడ్ సీజ‌న్ లో త‌న తొలి సెంచ‌రీని న‌మోదుచేశాడు. ఈ సీజ‌న్ లో సెంచ‌రీ కొట్టిన విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, జోస్ బ‌ట్ల‌ర్ ల‌తో కూడిన సెంచ‌రీ వీరుల జాబితాలో చేరాడు.

అయితే, ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక స్కోర్ చేసిన జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. సన్రైజర్స్ హైదరాబాద్ 19 రోజుల తర్వాత తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఇదివ‌ర‌క‌టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై హైదరాబాద్ అత్యధిక స్కోరు చేయగా, త‌న రికార్డును తానే స్వయంగా బద్దలు కొట్టింది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ టీమ్ మూడు వికెట్లు కోల్పోయి 20 ఓవ‌ర్ల‌లో 287 ప‌రుగులు చేసింది. అంత‌కుముందు ముంబై ఇండియ‌న్స్ పై 277/3 ప‌రుగుల రికార్డును సృష్టించింది హైద‌రాబాద్.

Latest Videos

ఐపీఎల్ చ‌రిత్ర‌లో టీమ్ అత్య‌ధిక స్కోర్లు..  

287/3 హైద‌రాబాద్ vs బెంగ‌ళూరు, బెంగ‌ళూరులో  2024
277/3 హైద‌రాబాద్ vs ముంబై, హైద‌రాబాద్ లో 2024
272/7 కోల్ క‌తా vs ఢిల్లీ, వైజాగ్ లో 2024
263/5 బెంగ‌ళూరు vs పూణే, బెంగ‌ళూరులో 2013
257/7 ల‌క్నో vs పంజాబ్, మొహాలీలో 2023

కొడితే స్టేడియం బ‌య‌ట‌ప‌డ్డ బంతి.. హెన్రిచ్ క్లాసెన్ భారీ సిక్స‌ర్ తో స్టేడియం షేక్.. !

కాగా, టాప్ 3లో ఉన్న 250+ స్కోర్లు ఐపీఎల్ 2024 సీజ‌న్ లోనే రావ‌డం విశేషం. అందుటో టాప్-2 హైద‌రాబాద్ టీమ్ సాధించిన‌వి కావ‌డం విశేషం. ప్ర‌స్తుత మ్యాచ్ లో హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు బెంగ‌ళూరు బౌలింగ్ ను ఉతికిపారేశారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 108 పరుగులు జోడించారు. హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో ఈ సీజ‌న్ లో తొలి సెంచ‌రీ కొట్టాడు. అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన హెన్రిచ్ క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్ తో 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో ఆడమ్ మార్క్రమ్ 17 బంతుల్లో 32 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు దీంతో మూడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ టీమ్ 287 పరుగులతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక జ‌ట్టు స్కోర్ ను న‌మోదుచేసింది.

 

First time was so nice, we had to do it twice 😁 pic.twitter.com/bHlxml4ZxR

— SunRisers Hyderabad (@SunRisers)


కిర్రాక్ బ్యాటింగ్.. సిక్స‌ర్లే సిక్స‌ర్లు.. 39 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ రికార్డు సెంచ‌రీ

 

click me!