RCB vs SRH : బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ లో హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మరో రికార్డు సెంచరీ కొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు ట్రావిస్ హెడ్.
IPL 2024 RCB vs SRH : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బౌండరీల వర్షంతో తడిసిపోయింది. సిక్సర్ల మోతతో అదిరిపోయింది. బెంగళూరు బౌలింగ్ ను చీల్చిచెండాడిన హైదరాబాద్ బ్యాటర్స్ పరుగుల వరద పారించాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దెబ్బకు 7 ఓవర్లలోనే 100+ మార్కును అందుకుంది. ఏం చేయాలో తెలియక బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. పవర్ ప్లే లో రెండు సార్లు ట్రావిస్ హెడ్ రికార్డు హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మలిచాడు.
బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోత మోగించాడు. అదరిపోయే షాట్స్ కొడుతూ బెంగళూరు బౌలింగ్ దుమ్ముదులిపాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మలిచాడు. 39 బంతుల్లో సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన 4వ సెంచరీ కావడం విశేషం.
undefined
టీ20 క్రికెట్ లో ఒకే ఒక్కడు.. సిక్సర్ల మోత.. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 𝗜𝗣𝗟 𝗛𝘂𝗻𝗱𝗿𝗲𝗱!
A century off just 39 deliveries for Travis Head 🔥🔥
4th Fastest in IPL history!
Follow the Match ▶️ https://t.co/OOJP7G9bLr | pic.twitter.com/25mCG5fp4C
ధోని కొట్టిన ఆ హ్యాట్రిక్ సిక్సులే చెన్నైని గెలిపించాయి.. ! ముంబైని ముంచేశావ్ కదా హార్దిక్ !