2011 ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేశాం.. ఫైనల్లో ఫిక్సింగ్: లంక మాజీ మంత్రి సంచలనం

By Siva KodatiFirst Published Jun 18, 2020, 6:09 PM IST
Highlights

ఆ ప్రపంచకప్‌‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు ఆ దేశానికి చెందిన మాజీ క్రీడా శాఖ మంత్రి మహిందానంద అలుతగమగే సంచలన వ్యాఖ్యలు చేశారు

1983లో కపిల్ డేవిల్స్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విశ్వవిజేతగా అవతరించడానికి మూడున్నర దశాబ్ధాలకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. అభిమానుల చిరకాల కోరికకు తెరదించుతూ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.

అయితే ఆ ప్రపంచకప్‌‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు ఆ దేశానికి చెందిన మాజీ క్రీడా శాఖ మంత్రి మహిందానంద అలుతగమగే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో శ్రీలంక అమ్ముడుపోయిందని.. తాను అప్పట్లో స్పోర్ట్స్ మినిస్టర్‌నని చెప్పాడు.

తాను ఏ ఆటగాడితోనూ ప్రస్తుతం కాంటాక్ట్‌లో లేను. కానీ టీమ్‌లోని కొంతమంది ఫిక్సింగ్‌కి సహకరించారని మహీందా అన్నారు. ఆ మ్యాచ్‌లో టాస్ వద్దే కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని... కుమార సంగక్కర మధ్య కన్‌ఫ్యూజన్ కారణంగా రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత లంక తుది జట్టు ఎంపికైనా ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు గుప్పించాడు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు జయవర్దనే 103 రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు గౌతమ్ గంభీర్ 97, ధోనీ 91తో చెలరేగడంతో టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్‌గా అవతరించింది.  

2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌పై గ‌తంలో మ‌రో శ్రీలంక క్రీడా మంత్రి ద‌యాసిరి జ‌య‌శేక‌ర కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. 2017లో మాజీ క్రికెట‌ర్ అర్జున ర‌ణ‌తుంగ లేవ‌నెత్తిన అంశాల ఆధారంగా ఆ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫిక్సింగ్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌నుకుంటున్న‌ట్లు ద‌యాసిరి తెలిపారు.  
 

click me!