SRHvsRCB: డేవిడ్ వార్నర్‌ రనౌట్... వెంటాడిన బ్యాడ్‌లక్...

Published : Sep 21, 2020, 10:02 PM IST
SRHvsRCB: డేవిడ్ వార్నర్‌ రనౌట్... వెంటాడిన బ్యాడ్‌లక్...

సారాంశం

బెంగళూరుపై డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డు... గత 8 మ్యాచుల్లో ఏడు సార్లు హాఫ్ సెంచరీకి పైగా స్కోరు చేసిన వార్నర్... దురదృష్టవశాత్తు రనౌట్...

IPL 2020: ఐపీఎల్‌లో అదరగొట్టే కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యి వెనుదిరిగాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి పంపించిన వార్నర్, మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో స్టైయిట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఆపేందుకు చేతిని అడ్డు పెట్టాడు ఉమేశ్ యాదవ్. ఉమేశ్ చేతిని ముద్దాడిన బంతి, నేరుగా వెళ్లి వికెట్లను తాకింది.

సింగిల్ తీసేందుకు డేవిడ్ వార్నర్, క్రీజులో నుంచి బయటికి రావడంతో రనౌట్ అయ్యాడు. నిరాశగా ఎదురుతిరిగాడు డేవిడ్ వార్నర్. ప్రతీ సీజన్‌లో అదరగొట్టే డేవిడ్ వార్నర్‌కు ఈ సారి మొదటి మ్యాచ్‌లోనే బ్యాడ్ లక్ వెంటాడింది. గత సీజన్‌లో బెంగళూరుపై అజేయ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్‌కి ఆర్‌సీబీపై ఇదే లో స్కోర్.

ఇంతకుముందు ఏడు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేసిన వార్నర్... ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 14 పరుగులకు అవుట్ అయ్యాడు. నేడుగా బ్యాడ్ లక్‌ కారణంగా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !