SRH vs RCB: ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్... 20 ఏళ్ల కుర్రాడిని కోహ్లీ ఎందుకు నమ్మాడు...

By team teluguFirst Published Sep 21, 2020, 7:55 PM IST
Highlights

భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ వంటి స్టార్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్...

20 ఏళ్ల కుర్రాడిపైన చాలా నమ్మకం ఉంచిన విరాట్ కోహ్లీ...

దేవ్‌దత్ పడిక్కల్... భారత సారథి విరాట్ కోహ్లీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడీ 20 ఏళ్ల కుర్రాడి మీద. సోషల్ మీడియాలో కూడా దేవ్‌దత్‌ను హైలెట్ చేస్తూ వచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్లను పక్కనబెట్టి ఓపెనింగ్‌కి వచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్. అసలు ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్. అతన్ని ఎందుకింత హైలెట్ చేస్తున్నారు.

2018 సీజన్‌లో కర్ణాటక తరుపున రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్. లిస్టు ఏలో విజయ్ హాజరే ట్రోఫీలో 11 మ్యాచుల్లో 609 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో 580 పరుగులు చేశాడు దేవ్‌దత్. 175. 75 స్టైయిట్ రేటుతో ఈ టీ20 ట్రోఫీలో చెలరేగిపోయాడు. ఓవర్‌కి 10కి పైగా పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు దేవ్‌దత్.

అంబటి రాయుడి మేనమామ దగ్గర ట్రైయినింగ్ తీసుకున్న దేవ్‌దత్ తల్లిదండ్రులు, హైదరాబాద్‌లోని ఆర్‌కె పురంలో సెటిల్ అయ్యారు. అయితే దేవ్‌దత్ కెరీర్ కోసం కర్ణాటక వెళ్లారు దేవ్‌దత్ తల్లిదండ్రులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచుల్లో 907 పరుగులు, లిస్టు ఏలో 13 మ్యాచుల్లో 650 పరుగులు, టీ20ల్లో 12 మ్యాచుల్లో 580 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

click me!