‘మేం బాగా ఆడాం... కానీ బ్యాడ్‌లక్...’ ఓటమిపై హెడ్ కోచ్ కుంబ్లే రియాక్షన్!

Published : Sep 21, 2020, 07:23 PM ISTUpdated : Sep 21, 2020, 07:26 PM IST
‘మేం బాగా ఆడాం... కానీ బ్యాడ్‌లక్...’ ఓటమిపై హెడ్ కోచ్ కుంబ్లే రియాక్షన్!

సారాంశం

విజయం దాకా వచ్చిన మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా నిరాశపర్చింది. పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్ ఇది...  చేజేతులా ఓడిపోయినట్టు అయ్యింది... పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే...

IPL 2020లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ‘సూపర్’ విజయం సాధించింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ 2 పరుగులు మాత్రమే చేసి, రెండు వికెట్లు కోల్పోడంతో ఢిల్లీ సునాయస విజయం సాధించింది. అయితే మయాంక్ అగర్వాల్ తీసిన రెండు పరుగులను ‘షార్ట్ రన్’గా పరిగణించి, అంపైర్ సింగిల్‌ మాత్రమే ఇవ్వడం వివాదానికి దారి తీసింది.

తాజాగా ఈ విషయమై స్పందించాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోచ్ అనిల్ కుంబ్లే. ‘విజయం దాకా వచ్చిన మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా నిరాశపర్చింది. పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్ ఇది. చేజేతులా ఓడిపోయినట్టు అయ్యింది. సూపర్ ఓవర్‌లో కనీసం 10, 12 పరుగులు చేసి ఉంటే బాగుండేది... ఆటలో తప్పిదాలు సహజం. మొదటి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం... మా ఆటతీరు బాగుంది... ’ అని తెలిపాడు అనిల్ కుంబ్లే. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !