SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ ఊచకోత.. ఊరమాస్ బ్యాటింగ్ ఇది !

Published : May 25, 2025, 08:51 PM IST
IPL 2025: Sunrisers Hyderabad batting tsunami against KKR

సారాంశం

SRH vs KKR IPL 2025: కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపే బ్యాటింగ్ పరుగుల సునామీ తెచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లు కోల్ కతా బౌలింగ్ ను చితక్కొట్టారు. 

SRH vs KKR IPL 2025: ఐపీఎల్‌ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లకు ఇది చివరి మ్యాచ్. గౌరవప్రదమైన విజయంతో వీడ్కోలు పలకాలని హైదరాబాద్, కోల్ కతా జట్లు పట్టుదలతో బరిలోకి దిగాయి. 

పరుగుల వర్షం తెచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్

గత మూడు నాలుగు మ్యాచ్‌లలో జట్టు బాగా ఆడిందనీ, ఈ మ్యాచ్‌లోనూ ఆ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. అందుకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించారు.

హైదరాబాద్ టీమ్ తరఫున ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. మ్యాచ్ ఆరంభం నుంచే కోల్ కతా బౌలింగ్ ను దంచికొట్టారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే 32 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. 

17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన హెన్రిచ్ క్లాసెన్

ఈ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన నాక్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. వీరి సూపర్ నాక్ తో కేవలం 15 ఓవర్లలోనే 204/2 పరుగులు చేసింది.  

KKR vs SRH: ప్లేయింగ్ XI

కేకేఆర్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఆండ్రిచ్ నోర్ట్జే, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ సబ్స్ - రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, స్పెన్సర్ జాన్సన్, లవ్‌నీత్ సిసోడియా.

ఎస్ఆర్హెచ్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నీతీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ.

ఇంపాక్ట్ సబ్స్ - మహమ్మద్ షమీ, హర్ష్ దుబే, సచిన్ బేబీ, సీషన్ అన్సారీ, సిమర్జీత్ సింగ్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?