GT vs CSK: గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చిన చెన్నై సూపర్

Published : May 25, 2025, 07:39 PM IST
Chennai Super Kings Triumph Over Gujarat Titans in IPL 2025

సారాంశం

IPL 2025 GT vs CSK: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో గుజరాత్ టైటాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. తమ చివరి మ్యాచ్ ను గెలిచి ఐపీఎల్ 2025 సీజన్ ను సీఎస్కే ముగించింది.

IPL 2025 GT vs CSK: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ 147 పరుగులకే ఆలౌటైంది. సీజన్‌లో చివరి మ్యాచ్‌లో చెన్నైకి 83 పరుగుల తేడాతో గెలుపు దక్కింది.

231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభం నుంచే తడబడింది. పవర్ ప్లే ముగిసేలోపు గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (5), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (0) కూడా నిరాశపరిచారు. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ముందున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 15 బంతుల్లో 19 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్‌ను, 28 బంతుల్లో 41 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ను జడేజా ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపడంతో గుజరాత్ కష్టాల్లో పడింది.

85/6తో కష్టాల్లో పడిన గుజరాత్‌ను రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్‌ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. తర్వాత జెరార్డ్ కోట్సీ వికెట్‌ను మతీష పతిరణ పడగొట్టడంతో చెన్నై విజయం దిశగా పయనించింది. 16వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా (14)ను నూర్ అహ్మద్ అవుట్ చేయడంతో గుజరాత్ ఆశలు సన్నగిల్లాయి. చివరి ఓవర్లలో అర్షద్ ఖాన్ మూడు సిక్సర్లు బాదినా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. అర్షద్ ఖాన్‌ను నూర్ అహ్మద్, సాయి కిషోర్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేయడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 147 పరుగులకు ముగిసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల తేడాతో గెలిచింది. 

టాస్ గెలిచిన ధోనీ

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. ఆయుష్ మాత్రే చిన్నదైనా సూపర్ నాక్ ఆడాడు. 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న డెవాన్ కాన్వే కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ (52 పరుగులు) కొట్టాడు.

టాప్ గేర్ లో బ్యాటింగ్ చేసిన డెవాల్డ్ బ్రెవిస్

కాన్వే, మాత్రే అవుట్ అయిన తర్వాత డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్ అదరిపోయే ఇన్నింగ్స్ లను ఆడారు. ఉర్విల్ 19 బంతుల్లో 37 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ సునామీ నాక్ తో కేవలం 23 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో చెన్నై టీమ్ గుజరాత్‌ ముందు 231 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?