SRHvsCSK: చెన్నై గ్రాండ్ కమ్ బ్యాక్ విక్టరీ... సన్‌రైజర్స్‌కి వరుసగా రెండో ఓటమి...

Published : Oct 13, 2020, 11:18 PM IST
SRHvsCSK: చెన్నై గ్రాండ్ కమ్ బ్యాక్ విక్టరీ... సన్‌రైజర్స్‌కి వరుసగా రెండో ఓటమి...

సారాంశం

కేన్ విలియంసన్ ఒంటరిపోరాటం వృథా... టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ ఫెయిల్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి... సీజన్‌లో మూడో విజయంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్...  

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమైన ధోనీ సేన, మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి, సీజన్‌లో మూడో విజయం అందుకుంది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 పరుగులకే అవుట్ కాగా, మంచి ఫామ్‌లో ఉన్న మనీశ్ పాండే 4 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసిన మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 24 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్‌‌బౌల్డ్ అయ్యాడు.‌ 

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ 18 బంతుల్లో 16 పరుగులు చేయగా... ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కేన్ విలియంసన్ 39 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు చేసి అవుట్ కాగా, రషీద్ ఖాన్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి ఉన్నంతసేపు సీఎస్‌కేని టెన్షన్ పెట్టాడు. రషీద్ అవుట్ కాగానే నదీమ్ కూడా పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖరారైంది...

PREV
click me!

Recommended Stories

Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా