
IPL 2020: క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. బౌలర్‌గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ శ్రీలంకన్ బౌలర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మోక్షన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘800 ది మూవీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, ముత్తయ్య మురళీధరన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మూవీ ట్రైన్ మోక్షన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు.
తమిళులకు శ్రీలంక దేశస్థులకు మంచి అనుబంధం ఉంటుంది. శరణార్థులుగా శ్రీలంకకి వెళ్లిన తమిళ కుటుంబానికి చెందిన ముత్తయ్య మురళీధరన్, తమిళనాడుకు చెందిన మదిమలార్ రామమూర్తిని 2005లో పెళ్లి చేసుకున్నాడు. టెస్టుల్లో 800, వన్డేల్లో 534, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,374, లిస్టు ఏ క్రికెట్‌లో 682 వికెట్లు తీసిన ఈ లెజెండరీ బౌలర్, ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో పేరు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న ముత్తయ్య, బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని దాటుకుని ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌గా మురళీధరన్ ఎదిగిన విధానాన్ని ఇందులో చూపించబోతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముత్తయ్య మురళీధరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.