బౌల్ట్, సౌథీ దెబ్బకు విలవిల: న్యూజిలాండ్ పై టీమిండియా ఘోర పరాజయం

By telugu teamFirst Published Feb 24, 2020, 7:46 AM IST
Highlights

సౌథీ, బౌల్ట్ ల దెబ్బకు భారత బ్యాటింగ్ తుత్తునియలు అయింది. తొలి టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ భారత్ పై ఘన విజయాన్ని అందుకుంది. పది వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది.

హామిల్టన్: టెస్టు మ్యాచుల్లో భారత్ వరుస విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. తొలి టెస్టు మ్యాచులో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు సోమవారం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో నాలుగు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. 
 
అజింక్యా రహానే 29 పరుగులు, హనుమ విహారి 15 పరుగులు చేశారు. వారిద్దరు సోమవారంనాడు న్యూజిలాండ్ బౌలర్లను ఏ మాత్రం ఎదుర్కోలేకపోయారు. ఆ తర్ావత రిషబ్ పంత్ (25), రవిచంద్రన్ అశ్విన్ (4), ఇషాంత్ శర్మ (12), మొహ్మద్ షమీ (2), జస్ప్రీత్ బుమ్రా (0) పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ రెంండో ఇన్నింగ్సులో 191 పరుగులు చేసింది. 

రెండో ఇన్నింగ్సులో భారత్ బ్యాటింగ్ ను ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కుప్పకూల్చారు. భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. సౌథి 5 వికెట్లు తీయగా, బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టాడు. గ్రాండ్ హోమ్ కు ఒక్క వికెట్ దక్కింది.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో భారత్ పై 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దాంతో విజయానికి రెండో ఇన్నింగ్సులో న్యూజిలాండ్ కు 9 పరుగులు అవసరమయ్యాయి. లాథమ్, బ్లండెల్ ఆ లాంఛనాన్ని పూర్తి చేసి విజయాన్ని అందించారు.  

click me!