దేవధర్ ట్రోఫీ 2023 విజేతగా సౌత్ జోన్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన రియాన్ పరాగ్...

Published : Aug 04, 2023, 11:35 AM ISTUpdated : Aug 04, 2023, 11:36 AM IST
దేవధర్ ట్రోఫీ 2023 విజేతగా సౌత్ జోన్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన రియాన్ పరాగ్...

సారాంశం

ఈస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న సౌత్ జోన్...  రోహన్ కున్నుమ్మల్ సెంచరీ! 95 పరుగులు చేసిన ఈస్ట్ జోన్ ప్లేయర్ రియాన్ పరాగ్.. 

దేవ్‌ధర్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని సౌత్ జోన్ కైవసం చేసుకుంది. ఈస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది సౌత్ జోన్. సౌత్ జోన్ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 

పుదుచ్చేరిలోని పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ 75 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు చేయగా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 83 బంతుల్లో 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. 

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సాయి సుదర్శన్ 19, నారాయణ్ జగదీశన్ 60 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేయగా రోహిత్ రాయుడు 26 పరుగులు, అరుణ్ కార్తీక్ 2 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ డకౌట్ కాగా సాయి కిషోర్ 24, విజయ్‌కుమార్ వైశాక్ 11 పరుగులు చేశారు...

329 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఈస్ట్ జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అభిమన్యు ఈశ్వరన్ 1, ఉత్కర్ష్ సింగ్ 4, విరాట్ సింగ్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఈస్ట్ జోన్. సుదీప్ కుమార్ ఘరామీ 41, కెప్టెన్ సౌరబ్ తివారీ 28, కుమార్ కుశంగ 68 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 65 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 పరుగులు చేసి.. సెంచరీకి 5 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు..

షాబజ్ అహ్మద్ 17, మనిశంకర్ మురసింగ్ 5, ఆకాశ్ దీప్ 7, ముక్తర్ హుస్సేన్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా విద్వత్ కరియప్ప, వాసుకి కౌషిక్, విజయ్‌కుమార్ వైశాక్ రెండేసి వికెట్లు తీశారు. 

దేవ్‌ధర్ ట్రోఫీలో 5 మ్యాచుల్లో 88.5 సగటుతో 354 పరుగులు చేసిన రియాన్ పరాగ్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో 11 వికెట్లు తీసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !