David Miller: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న డేవిడ్ మిల్లర్

Published : Mar 10, 2024, 10:29 PM IST
David Miller: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న డేవిడ్ మిల్లర్

సారాంశం

డేవిడ్ మిల్లర్ తన గర్ల్‌ఫ్రెండ్ కామిలా హారిస్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు వారు ఒక్కటైన చిత్రాలను హారిస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  

సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన గర్ల్‌ఫ్రెండ్‌ కామిలా హారిస్‌ను పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం వారు ప్రేమలో ఉన్నారు. తాజాగా, వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లి వేడుక చిత్రాలను పంచుకున్నారు.

డేవిడ్ మిల్లర్ వైట్ బాల్ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతర్జాతీయంగా దక్షిణాఫ్రికా టీమ్‌లో మంచి సభ్యుడిగా ఆయనకు పేరుంది. అలాగే. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోనూ మెరిశాడు. 2022 ఐపీఎల్ సీజన్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

గతేడాది ఆగస్టు 31వ తేదీన ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించాడు. తాను యెస్ అని చెప్పింది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చాడు.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !