Glenn Phillips: క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్-ఆస్ట్రేలియా టెస్టు లో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఫీల్డింగ్ తో క్యాచ్ పట్టాడు. పక్షిలా గాల్లోకి దూకి ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Glenn Phillips made a remarkable catch : న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో అద్భుతమైన ఘటన జరిగింది. అద్భుతమైన ఫీల్డింగ్ తో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ పట్టాడు న్యూజిలాండ్ ప్లేయర్. గాల్లోకి పక్షిలా దూకుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు కీవీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాతో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్‌తో క్రికెట్ అభిమానులను, సహచరులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈ మ్యాచ్ 61వ ఓవర్‌లో కివీ బౌలర్ టిమ్ సౌతీ వేసిన బంతిని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ ఎదుర్కొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆఫ్-స్టంప్ మీదుగా లాబుషేన్ షాట్ ఆడాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మెరుపు వేగంతో స్పందించి గాల్లోకి పక్షిలా దూకి ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందున్నాడు. అద్భుతమైన వేగంతో తన కుడివైపుకి డైవింగ్ చేస్తూ గాల్లోకి దూకాడు. లాబుషేన్ తో పాటు అక్కడున్న ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రశంసలతో ముంచెత్తారు.
SUPERMAN! 🦸 What a catch from Glenn Phillips! Australia are 221/8 at lunch on Day 2 🏏 v Australia: 2nd Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/Swx84jNFZb
— TVNZ+ (@TVNZ)