ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్... ఓపెనర్ గా సెట్టయ్యేనా...?

By Arun Kumar PFirst Published Sep 28, 2019, 4:44 PM IST
Highlights

మొదటిసారి టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మ ఓపెనర్ బరిలోకి దిగేందుకు రంగం సిద్దమైంది. ఇలాంటి కీలక సమయంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా ఘోరంగా విఫలమయ్యాడు. 

వన్డే, టీ20 పార్మాట్ లో అతడో గొప్ప ఓపెనర్. తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తూ చాలా మ్యచుల్లో భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఇలా ఫరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఓపెనింగ్ మాట అంటుంచి కనీసం జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించలేకపోయాడు. కానీ తాజాగా ఆ ఫార్మాట్లో కూడా ఓపెనింగ్  చేసే అరుదైన అవకాశం అతడికి లభించింది. అక్టోబర్ 2 నుండి విశాఖపట్నం వేదికన ప్రారంభమయ్యే టెస్ట్ సీరిస్ లో రోహిత్ మొదటిసారి ఓపెనింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. 

అయితే ఇప్పటికే విశాఖపట్నానికి చేరుకున్న పర్యాటక దక్షిణాఫ్రికాతో ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్ లెవెన్ జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి వుండగా వర్షం అడ్డంకి సృష్టించింది. దీంతో మొదటి రోజు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. రెండో రోజు టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్రమ్ 100, బవుమా 87నాటౌట్, ఫిలాండర్ 48 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 279 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 

ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రెసిడెంట్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటిసారి టెస్ట్ ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ పరుగులేమీ సాధించకుండానే డకౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే అతడు ఔటై నిరాశపర్చాడు.  తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ 71, పంచల్ 60, అగర్వాల్ 39 పరుగులతో రాణించారు. ఎస్డీ లాడ్ 52నాటౌట్ గా నిలిచాడు. దీంతో ప్రెసిడెంట్ ఎలెవన్  జట్టు చివరి రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి మ్యాచ్  ను డ్రాగా ముగించుకుంది. 

అయితే ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే అయినప్పటికి రోహిత్ శర్మ డకౌట్ అభిమానుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. యువ ఓపెనర్ మయాంక్ పరవాలేదనిపించిన ఇదే పిచ్ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు టెస్ట్ ఓపెనింగ్ కు సెట్ అవుతాడా అన్న అనుమానం  అభిమానెల్లో మొదలయ్యింది. 
 

click me!