South Africa vs India, 2nd Test Live: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జరుగుతున్న భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే, ఆరంభంలోనే భారత బౌలర్లు సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. మహ్మద్ సిరాజ్ సఫారీలను దెబ్బకొడుతూ కీలకమైన 5 వికెట్లు తీసుకున్నాడు.
South Africa vs India, 2nd Test: భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా బుధవారం రెండో టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తప్పకుండా గెలవాలని చూస్తున్న ఈ మ్యాచ్ ఆరంభంలోనే భారత బౌలర్లు సఫారీలను దెబ్బకొట్టారు. మన బౌలర్లు బౌన్సులతో విరుచుకుపడుతూ.. తొలి సెషన్ లో భారత్ కు మంచి శుభారంభం అందించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లను తన బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. తొలి సెషన్ లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ తర్వాత సెషన్ లో వెంటనే మరో 2 వికెట్లు తీసుకున్నాడు. ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గర్, టోనీ డి జోర్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్కో జాన్సెన్ లను సిరాజ్ ఔట్ చేశాడు. అలాగే, భారత సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ ను బుమ్రా తీసుకున్నాడు.
That's a 5-FER for 🔥🔥
His first five-wicket haul in South Africa and third overall. pic.twitter.com/lQQxkTNevJ
ఈ మ్యాచ్ లో ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చారు. ఇక సౌతాఫ్రికా జట్టులో గాయపడిన టెంబా బవుమా స్థానంలో బరిలోకి దిగిన ట్రిస్టన్ స్టబ్స్ కు అవకాశం లభించింది. దక్షిణాఫ్రికా తరఫున అతను అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే, గాయపడిన గెరాల్డ్ కోయెట్జీకి స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి రాగా, కేశవ్ మహారాజ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, ముఖేష్ కుమార్,
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. టార్గెట్ ఐపీఎల్ 2024 టైటిల్ !