క్రికెట్ మ్యాచ్ మధ్యలో యువతికి భారత అభిమాని ప్రపోజ్ చేశాడు. స్టేడియంలోనే యువతికి ప్రపోజ్ చేయడంతో ఆమె షాక్ కు గురైంది.
సిడ్నీ: అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఓ భారతీయ అభిమాని తన ప్రియురాలికి తన ప్రప్రోజ్ చేశాడు. దీంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ సమయంలో ఓ ఇంటర్వ్యూయర్ స్టాండ్స్ మధ్య నడుస్తూ అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు వేర్వేరు జట్లకు మద్దతు దారులుగా చొక్కాలు వేసుకున్న జంటతో ఇంటర్వ్యూయర్ మాట్లాడారు.
ప్రత్యర్ధి బృందాలకు మద్దతు ఇవ్వడం యువకుడిని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. తాను పెద్దస్టార్స్ అభిమానిగా ఆయన పేర్కొన్నారు. కానీ, ఆమె రెనెగెడ్స్ అభిమానిగా పేర్కొన్నారు.ఆ యువతికి గ్లెన్ మాక్స్ వెల్ అభిమానిగా అతను పేర్కొన్నారు. తనకు కూడ గ్లెన్ మాక్స్ వెల్ అంటే అభిమానం అని ఆయన పేర్కొన్నారు.ఈ కారణంగానే తాను ఆమెను ఇక్కడికి తీసుకు వచ్చినట్టుగా యువకుడు బదులిచ్చాడు.
యువకుడి ప్రియురాలు షాక్ తో చూస్తున్న సమయంలో మోకాలిపై వంగి ఆమె వైపు తిరిగి ఆమెకు ఉంగార్ని తొడగాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర ప్రేక్షకులు పెద్దగా అరుస్తూ మద్దతుగా నిలిచారు. ఇందుకు ఆ యువతి కూడ సమ్మతించింది. దీంతో యువకుడు యువతి వేలికి ఉంగరం తొడిగాడు. ఈ తతంగం చూసిన ఇంటర్వ్యూయర్ కూడ ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను 7 క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.
What better place to propose than the ? 💍
Congratulations to this lovely couple 🙌 pic.twitter.com/1pANUOXmu3
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. జీవితాంతం ఆదరించే జ్ఞాపకంగా పేర్కొన్నారు.