IND vs SA Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. భార‌త జ‌ట్టులోకి జ‌డేజా, ముఖేష్

By Mahesh Rajamoni  |  First Published Jan 3, 2024, 1:30 PM IST

South Africa vs India, 2nd Test Live: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌రుగుతున్న భార‌త్-సౌతాఫ్రికా రెండో టెస్టులో టాస్ గెలిచిన స‌ఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఓడిన భార‌త్.. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను స‌మం చేయాల‌ని చూస్తోంది. 
 


South Africa vs India, 2nd Test: భార‌త్ vs ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా బుధ‌వారం రెండో టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లలో స్వ‌ల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భార‌త్ జ‌ట్టులో రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చారు. ఇక సౌతాఫ్రికా జ‌ట్టులో గాయపడిన టెంబా బవుమా స్థానంలో బరిలోకి దిగిన ట్రిస్టన్ స్టబ్స్ కు అవ‌కాశం ల‌భించింది. దక్షిణాఫ్రికా త‌ర‌ఫున అత‌ను అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే, గాయపడిన గెరాల్డ్ కోయెట్జీకి స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి రాగా, కేశవ్ మహారాజ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.

కేప్ టౌన్ టెస్టుకు ఇరు జ‌ట్ల టీమ్ లు ఇవే.. 

Latest Videos

భార‌త్ (ప్లేయింగ్ XI):  రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ర‌వీంద్ర జ‌డేజా, బుమ్రా, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, సిరాజ్, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడీ.

T20 WORLD CUP టీమిండియా జ‌ట్టులోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ... బీసీసీఐ మంతనాలు !

 

click me!