IPL 2024 : ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఫ్లేఆఫ్ కు ముందు దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడా ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించాడు.
IPL 2024 Kagiso Rabada : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లీగ్ మ్యాచ్ లు దాదాపు ముగిసే దశకు చేరుకున్నాయి. ఇప్పటికీ కేవలం రెండు జట్లు మాత్రమే ఫ్లేఆఫ్ కు క్వాలిఫై అయ్యాయి. మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జరగనున్న మ్యాచ్ లు మరింతగా ఉత్కంఠను పెంచుతున్నాయి. పాక్ తో టీ20 సిరీస్ కోసం కీలక సమయంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ కు దూరం అయ్యారు. ఇదే క్రమంలో సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కూడా ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు.
దక్షిణాఫ్రికా పేస్ స్పియర్‌హెడ్ కగిసో రబాడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుండి ఔట్ అయ్యాడు. గాయాల కారణంగా.. అవయవాల మృదు కణజాల ఇన్‌ఫెక్షన్ గురికావడంతో స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన కగిసో రబడ.. ఆడిన గేమ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే, పంజాబ్ పేలవ ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి ఎలిమినేట్ అయింది. తమ స్టార్ బౌలర్ లేకుండానే మే 19న తమ చివరి లీగ్ మ్యాచ్ ను ఆడేందుకు పంజాబ్ సిద్ధమవుతోంది.
సూపర్ ఫీల్డింగ్.. కళ్లుచెదిరే క్యాచ్ పట్టిన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా ప్రశంసలు
"28 ఏళ్ల కగిసో రబాడా దక్షిణాఫ్రికాకు రాగానే ఆరోగ్య నిపుణులను కలిశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది" అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వచ్చే నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 కు రబాడ సన్నద్ధతపై గాయం ప్రభావం చూపే అవకాశం లేదని సీఎస్ఏ పేర్కొంది. "వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 224 కోసం కగిసో రబాడా సన్నద్ధత ప్రభావితం కాదని అంచనా వేయబడింది" అని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికా జూన్ 3న న్యూయార్క్‌లో శ్రీలంకతో ప్రపంచ కప్ 2024 తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది.
రసవత్తరంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా ఉన్నాయి..