IPL 2024 : మరింత రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు ... డిల్లీ గెలుపుతో సీన్ మొత్తం మారిపోయిందిగా...

By Arun Kumar P  |  First Published May 15, 2024, 9:09 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. లక్నోపై డిల్లీ విజయంతో ప్లేఆఫ్ లో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఉత్కంఠ  కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ మ్యాచులు ముగింపు దశకు చేరుకున్నాయి. అయినప్పటికే ప్లే ఆఫ్ ఆడేది ఎవరో క్లారిటీ రావడంలేదు.  కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్,పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచి ప్లేఆఫ్ కు చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల  కోసం తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా లక్నో సూపర్ జాయింట్స్ పై డిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఈ ప్లే ఆఫ్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. 

ఐపిఎల్ సీజన్ 17 లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు, పాయింట్స్ టేబుల్ ను పరిశీలిస్తే... కోల్ కతా నైట్ రైడర్స్ 19 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఆ తర్వాత 12 మ్యాచులు ఆడిన రాజస్థాన్ టీం 16 పాయింట్లతో రెండో స్దానంలో నిలిచింది. ఇక మిగతా రెండు స్థానాల కోసం ఐటు జట్లు పోటీ పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ ప్లేఆఫ్ రేసులో వున్నాయి. 

Latest Videos

లక్నోపై డిల్లీ విజయం సిఎస్కే, ఆర్సిబి తో పాటు హైదరాబాద్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒకవేళ డిల్లిపై లక్నో విజయం సాధించి వుంటే పరిస్థితి మరోలా వుండేది. కానీ డిల్లీ విజయంతో  ప్లేఆఫ్ మరింత రసవత్తరంగా మారింది. 

చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ప్రస్తుతం ఈ టీం 14 పాయింట్ల కలిగివుండటమే కాదు మంచి రన్ రేట్ వుంది. ఆర్సిబితో ఇంకో మ్యాచ్ ఆడాల్సి వుంది. ఇందులో సిఎస్కే విజయం సాధిస్తే ప్లేఆఫ్ కు చేరవచ్చు. 

సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కూడా ప్లేఆఫ్ కు చేరే అవకాశాలు మెండుగా వన్నాయి. ప్రస్తుతం ఈ టీం 14పాయింట్లతో కొనసాగుతోంది. కేవలం 12 మ్యాచులే ఆడిన సన్ రైజర్స్ గుజరాత్, పంజాబ్ తో ఆడాల్సి వుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే సన్ రైజర్స్ ఈజీగా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర మ్యాచుల ఫలితాలు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి వుంటుంది. 

డిల్లీ క్యాపిటల్స్, ఆర్సిబి, లక్నో జట్ల ప్లేఆఫ్ ఆశలు కూడా సజీవంగానే వున్నాయి. డిల్లి ఇప్పటికే 14 మ్యాచులను ఫినిష్ చేసుకుని 14 పాయింట్లతో నిలిచింది. ఆర్సిబి 13 మ్యాచులాడి 12, లక్నో 13 మ్యాచులాడి 12 పాయింట్లతో నిలిచాయి. ఈ క్రమంలోనే  ఒకవేళ చెన్నై, సన్ రైజర్స్ మిగతా మ్యాచులు ఓడి ఆర్సిబి,లక్నో మిగతా మ్యాచులు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరవచ్చు. అలాగయితే ఐదు జట్లు  14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి... రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్ ఆడే జట్లను డిసైడ్ చేయాల్సి వుంటుంది. 

click me!