దక్షిణాఫ్రికాకు షాక్... ప్రపంచ కప్ జట్టు నుండి కీలక ప్లేయర్ ఔట్

Published : May 29, 2019, 04:36 PM IST
దక్షిణాఫ్రికాకు షాక్... ప్రపంచ కప్ జట్టు నుండి కీలక ప్లేయర్ ఔట్

సారాంశం

ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర గాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్ ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ కు దూరం కానున్నాడని ఆ  జట్టు చీఫ్ కోచ్ గిబ్సన్ ప్రకటించారు. అతడి భుజానికైన గాయం ఇంకా తగ్గకపోవడంతోనే గురువారం ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ నుండి అతన్ని తప్పించినట్లు ఆయన వెల్లడించారు. 

అయితే వచ్చేనెల 2వ తేధీ ఆదివారం రోజు బంగ్లాదేశ్ తో జరిగే రెండో మ్యాచ్ అతడు అందుబాటులోకి వచ్చే అవకాశముందని గిబ్సన్ తెలిపారు. అప్పట్లోపు అతడు గాయం నుండి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ తో బరిలోకి దిగుతాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. లేదంటే భారత్‌తో జూన్‌ 5వ తేదీన జరిగే మ్యాచ్ లో తప్పకుండా అందుబాటులో ఉంటాడని గిబ్సన్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ స్టెయిన్ గాయపడ్డాడు. దీంతో అతడు అర్థాంతరంగానే  ఐపిఎల్ కు దూరమవ్వాల్సి వచ్చింది. అయితే ఇదే గాయం ఇప్పుడు అతన్ని ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ కు దూరం చేసింది. 

''ప్రస్తుతానికి డెయిల్ స్టెయిన్ ఇంకా కోలుకోలేదు. అందువల్లే ఇంగ్లాండ్ తో జరిగే ఆరంభ మ్యాచ్ అతడు దూరమయ్యాడు. అయితే తమ జట్టులో నాణ్యమైన బౌలర్లకు కొదవలేదని... కాబట్టి స్టెయిన్ లేకపోవడం వల్ల సమస్యేమీ ఉండదు. కాబట్టి అతడు కోలుకోడానికి  ఎంత సమయం కావాలంటే అంత ఇస్తాం. ఖచ్చితంగా ఆదివారం బంగ్లాతో జరిగే మ్యాచ్ లో అందుబాటులోకి వస్తాడని చెప్పలేను....కానీ భారత్ తో జరిగే మ్యాచ్ లో తప్పకుండా ఆడతాడు'' అని గిబ్సన్ వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?