ప్రపంచ కప్ 2019: విచిత్రం...బంగ్లా ఫీల్డింగ్ ను సెట్ చేసిన ధోనీ

By Arun Kumar PFirst Published May 29, 2019, 3:03 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎంత చురుగ్గా వుంటాడో అందరికి తెలిసిందే. అతడు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్నప్పటికి మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌల ర్లకు సలహాలివ్వడం చేస్తుంటాడు. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కెప్టెన్ కోహ్లీకి విలువైన  సలహాలు ఇస్తుంటాడు. ఇలా ధోని బ్యాట్ మెన్, వికెట్ కీఫర్ గానే కాకుండా అనధికారికి కెప్టెన్ గా వ్యవహరిస్తూ భారత్ కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు.
 
అయితే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెకండ్ వార్మప్ మ్యాచ్ లో ధోని మరోసారి అద్భుతం చేశాడు. కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో అతడు మెరుపు ఇన్సింగ్స్ (78 బంతుల్లో 113 పరుగులు)తో భారత్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. ఇలా బ్యాటింగ్ చేపడుతున్న క్రమంలోనే ధోనీ  బంగ్లా పీల్డింగ్ ను కూడా సెట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

బ్యాటింగ్  చేస్తున్నప్పుడు ఏ బ్యాట్ మెన్ అయినా తన ఆటపైనే దృష్టి పెడతారు. కానీ ధోని మాత్రం తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనిస్తాడు. ఇలా బంగ్లా బౌలర్ షబ్బీర్  రహ్మాన్ 40వ  ఓవర్ వేస్తున్న సమయంలో బంగ్లా ఫీల్డింగ్ లో తప్పును గమనించాడు. దీంతో శబ్బీర్ ను మధ్యలోనే ఆపి ఫీల్డింగ్ సెట్ చేసుకోవాల్సిందిగా సూచించాడు. అందుకు అంగీకరించిన బౌలర్ ఓ ఫీల్డర్ స్థానాన్ని మార్చి బౌలింగ్ కొనసాగించాడు. 

ప్రపంచ కప్ మెయిన్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచులో భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు మరోసారి  విఫలమైనా టాప్ ఆర్డర్ లో కోహ్లీ (46పరుగులు)  పరవాలేదనిపించాడు. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108 పరుగులు), ధోని (78 బంతుల్లో 113 పరుగులు) సెంచరీలతో అదరగొట్టడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఈ  భారీ లక్ష్యాన్ని చేధించడం కోసం బరిలోకి దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా  95 పరుగుల తేడాతో గెలుపొందింది.   
 
click me!