దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు రద్దు: మరి ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల పరిస్థితి..?

By team teluguFirst Published Sep 11, 2020, 1:03 PM IST
Highlights

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ను ఆ దేశ ప్రభుత్వం, క్రీడా సమాఖ్య సంయుక్తంగా రద్దు చేసింది. దీనితో దక్షిణాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. 

దక్షణఫ్రికా క్రికెట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ను ఆ దేశ ప్రభుత్వం, క్రీడా సమాఖ్య సంయుక్తంగా రద్దు చేసింది. దీనితో దక్షిణాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. 

గత సంవత్సర కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 డిసెంబర్ నుండి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతునే ఉన్నాయి. క్రీడాకారులు సైతం క్రికెట్ బోర్డు నిర్ణయాలను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. 

ఆటగాళ్ల పట్ల జాతిదురహంకారం ప్రదర్శించటం, ఆటగాళ్లకు వేతనాలు సరిగా అందించకపోవడం, అవినీతి ఆరోపణలు అన్ని వెరసి క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సౌత్ ఆఫ్రికా ఒలింపిక్ కమిటీ క్రికెట్ బోర్డును పక్కకు తప్పుకోమని ఆ బాధ్యతలను స్వీకరించింది. 

ఇప్పుడు ఇది తీవ్ర దుమారంగా మారి క్రికెటర్ల భవిష్యత్తే కష్టాల్లో పడే ఆస్కారం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ప్రభుత్వ జోక్యం ఎక్కువైనందుకే జింబాబ్వే క్రికెట్ పై కొద్దీ కలం ఐసీసీ బ్యాన్ విధించిన విషయం విదితమే! 

ఇప్పుడు సౌతాఫ్రికా కూడా ఇదే తరహా బ్యాన్ ని ఎదుర్కునే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ ఒప్పుకోదు. ఐసీసీ గనుక ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే.... దక్షిణాఫ్రికా క్రికెట్ రెండవ సారి కూడా బ్యాన్ ఎదుర్కునే ప్రమాదం ఉంది. గతంలో 1970 నుంచి 1991 వరకు వర్ణవివక్ష కారణంగా సౌతాఫ్రికాను నిషేధించింది ఐసీసీ. 

ఇదిలా ఉంటే సౌతాఫ్రికా క్రికెట్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.... తమను పక్కకు తప్పుకోమనడంపై అభ్యంతరం తెలిపింది. న్యాయ పరమైన సలహాలను తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు 

CSA statement on SASCOC resolutions 👇 pic.twitter.com/Lo5DtBxrJq

— Cricket South Africa (@OfficialCSA)

మరి ఐపీఎల్ లో ఆడే క్రీడాకారుల పరిస్థితి...?

ఐపీఎల్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు కీలకం. రబాడా, ఎంగిడి, క్విన్టన్ డికాక్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, మిల్లర్ మొదలైన హేమాహేమీలు వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు. ఇప్పుడు దక్షిణాఫ్రికా ప్రభుత్వ నిర్ణయంతో అభిమానుల్లో కలవరం మొదలయింది. 

దక్షిణాఫ్రికా ప్రభుత్వ నిర్ణయం ఐపీఎల్ వంటి లీగ్ పై ఎటువంటి ప్రభావం చూపదు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ మ్యాచులపై ప్రభావం ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఐపీఎల్ కి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు.  

click me!