హర్భజన్‌‌ను నిండా ముంచిన చెన్నై వ్యాపారి : రూ.4 కోట్లు కుచ్చుటోపీ

By Siva KodatiFirst Published Sep 10, 2020, 8:41 PM IST
Highlights

టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఓ వ్యక్తి రూ.4 కోట్లకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన ఓ వ్యాపారి తన వద్ద రూ. 4 కోట్లు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టాడని ఫిర్యాదు భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఓ వ్యక్తి రూ.4 కోట్లకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన ఓ వ్యాపారి తన వద్ద రూ. 4 కోట్లు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టాడని ఫిర్యాదు భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2015లో హార్భజన్ ‌కు కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేశ్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితుని నమ్మి హార్భజన్.. మహేశ్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు.

అయితే తన బాకీ తీర్చాల్సిందిగా హర్భజన్ ఎన్నోసార్లు అడిగాడు. ఈ నేపథ్యంలో గత ఆగస్టులో భజ్జీ పేరు మహేశ్ రూ. 25 లక్షల చెక్కును పంపినప్పటికీ అది బౌన్స్ అయ్యింది.

నాటి నుంచి మహేశ్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఇక లాభం లేదనుకున్న హర్భజన్ సింగ్.. తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో తనను అరెస్ట్ చేయకుండా సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

కాగా హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరం కావడంతో రూ.2 కోట్లు కోల్పోనున్నాడు. 

click me!