కోహ్లీ కి గంగూలీ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే..

By telugu teamFirst Published Oct 30, 2019, 11:26 AM IST
Highlights

గతంలో డే అండ్ నైట్ మ్యాచులు జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పలు కారణాలు తెలిపింది. ఇప్పుడు బీసీసీఐ అధికారాలు గంగూలీ చేపట్టడంతో... ఆ రూల్స్ మొత్తం మార్చేశాడు. డే అండ్ నైట్ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు.
 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.... బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. డే-నైట్ టెస్టు మ్యాచులు ఆడేందుకు అన్ని వైపుల నుంచి అంగీకారం రావడంతో... గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.... టెస్టులో టీమిండియా జట్టు నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. అయితే.... ఇప్పటి వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ ఇప్పటి వరకు ఆడలేదు.  త్వరలో బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో.... ఈ రెండు జట్లు డే అండ్ నైట్ టెస్టులు ఆడేలా గంగూలీ పూనుకున్నాడు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

గతంలో డే అండ్ నైట్ మ్యాచులు జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పలు కారణాలు తెలిపింది. ఇప్పుడు బీసీసీఐ అధికారాలు గంగూలీ చేపట్టడంతో... ఆ రూల్స్ మొత్తం మార్చేశాడు. డే అండ్ నైట్ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు.

దీనిని అములలోకి తీసుకువచ్చేందుకు ముందుగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించాడు.  అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డే అండ్ నైట్ టెస్టు కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనను బీసీబీ అంగీకారం తెలిపింది. దీంతో.... టీమిండియా తొలి డే అండ్ నైట్ టెస్టుకి మార్గం సుగుమమైంది. దీంతో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్, భారత్ ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

AlsoRead సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ధోనీ రిటైర్మెంట్... అభిమానుల్లో కంగారు

టీమిండియా తొలి డే నైట్‌ టెస్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘బీసీబీ పింక్‌బాల్‌ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు అంగీకారం తెలిపిన కెప్టెన్‌ కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు‌’ అని గంగూలీ అన్నాడు.

 అయితే సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాల్సిందేనని దాదా పేర్కొన్నాడు.  నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లో పింక్‌బాల్‌ క్రికెట్‌ ఆడించాలని అప్పటి క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. 

ఇక అధ్యక్షుడిగా కేవలం 9 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో భారత క్రికెట్‌ అభివృద్ధికి దాదా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

click me!