సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ధోనీ రిటైర్మెంట్... అభిమానుల్లో కంగారు

By telugu teamFirst Published Oct 29, 2019, 4:29 PM IST
Highlights

దీంతో మరోసారి ధోనీ రిటైర్మెంట్  టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోసల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది.ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ కి సంబంధించిన వార్తలు ఆ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చాయి. ప్రపంచకప్ అనంతరం ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ధోనీ కొట్టిపారేశారు. తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానో తనకే తెలీదని పేర్కొన్నాడు.

ప్రపంచకప్ తర్వాత ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. రెండు నెలలు ఆర్మీకీ సేవలు అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లాడు. ఆ విధులు పూర్తి చేసుకొని కూడా ధోనీ తిరిగి వచ్చాడు. ధోనీ ఆర్మీకి వెళ్లాడనే కారణంతో దక్షిణాఫ్రికాతో మ్యాచులలో చోటు ఇవ్వలేదు. ఇప్పుడు ధోనీ తిరిగివచ్చాడు. త్వరలో బంగ్లాదశ్ తో సీరిస్ లు జరగనున్నాయి. వాటికి కూడా ధోనీని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. 

దీంతో మరోసారి ధోనీ రిటైర్మెంట్  టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోసల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది.ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది.

మంగళవారం అనూహ్యంగా ట్విటర్‌లో ధోని రిటైర్మెంట్‌(#Dhoniretires) హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ధోని సాధించిన ఘనతలు, రికార్డులను గుర్తుచేస్తూ రిటైర్మెంట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనితో పాటు #ThankYouDhoni అనే మరో హ్యాష్‌ ట్యాగ్‌ కూడా తెగ ట్రెండ్‌ అవుతోంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. 

అయితే జార్ఖండ్‌ డైనమెట్‌ వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. అంతేకాకుండా అతడికి మద్దతుగా నిలుస్తూ #NeverRetireDhoni అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.  ఇక ధోని వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు ధోని ఆడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా... ధోనీని పక్కన పెట్టిన సెలక్టర్లు... ఆయన స్థానంలో రిషబ్ పంత్ కి చోటు కల్పించారు. అయితే... దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పంత్ అనుకున్నంతగా రాణించలేదు. దీంతో నెటిజన్లు విమర్శించారు. ధోనీని తప్పించి... పంత్ ని తీసుకువచ్చారంటూ సెలక్టర్లపై మండిపడ్డారు. 

కాగా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ధోనీ భవిష్యత్తు గురించి తాను త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని  చెప్పిన గంగూలీ ఆ తర్వాత మాట మార్చేశాడు.  అయితే రిటైర్మెంట్‌ విషయం ధోని వ్యక్తిగతమని, ఆ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరని గంగూలీ సింపుల్‌గా తేల్చిపారేశాడు. ఇక ధోనికి ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడించి ఘనంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. 

click me!