న్యూ లుక్ లో ధోనీ ... బ్రావో షాక్..వీడియో వైరల్

Published : Oct 29, 2019, 03:34 PM IST
న్యూ లుక్ లో ధోనీ ... బ్రావో షాక్..వీడియో వైరల్

సారాంశం

ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు. చాలా మందికి ధోనీ కేవలం క్రికెటర్ గానే తెలుసు. అయితే... ధోనీకి కేవలం క్రికెట్ లోనే కాకుండా వివిధ క్రీడల్లో ఆరితేరాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్‌ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, టేబుల్‌ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు.

దీపావళి పండగను పురస్కరించుకొని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియోని  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ లో  పోస్టు చేసింది. కాగా... ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు. చాలా మందికి ధోనీ కేవలం క్రికెటర్ గానే తెలుసు. అయితే... ధోనీకి కేవలం క్రికెట్ లోనే కాకుండా వివిధ క్రీడల్లో ఆరితేరాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్‌ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, టేబుల్‌ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు.

ఈ క్రమంలోనే సీఎస్‌కే సహచర ఆటగాడైన బ్రేవోతో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడాడు. కాగా, ధోని ఆడిన బ్యాక్‌హ్యాండ్ స్మాష్‌కు డ్వేన్ బ్రావో సైతం షాకయ్యాడు. దీంతో డ్వే బ్రావో నేను ర్యాలీ ఆడుతున్నా అని చెప్పగా ధోని తనదైన స్టైల్‌లో తాను ర్యాలీలు ఆడను అని చెప్పాడు. ఏదేమైనా ధోని, బ్రేవో సుదీర్ఘ ర్యాలీ ఆడినప్పటికీ ధోనినే పాయింట్ గెలిచాడు.2019, మార్చిలో రూపొందించిన ఈ వీడియోను సీఎస్‌కే తన ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విడుదల చేసింది.
 
PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు