అబ్బ... సూపర్ మ్యాచ్ రా మావ... నాలుగో టీ20ని ఆసక్తిగా వీక్షించిన వానరాలు...

Published : Mar 19, 2021, 03:37 PM IST
అబ్బ... సూపర్ మ్యాచ్ రా మావ... నాలుగో టీ20ని ఆసక్తిగా వీక్షించిన వానరాలు...

సారాంశం

అహ్మదాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు... ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తున్న గుజరాత్ క్రికెట్ అసోసియేషన్... గ్రౌండ్ స్టాఫ్ మినహా స్టేడియంలో కనిపించని జనం... మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తూ కెమెరాలకు చిక్కిన వానరాలు... 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచులకు 67 వేలకు పైగానే ప్రేక్షకులు హాజరైన సంగతి తెలిసిందే. వేల మంది కరతాళ ధ్వనులతో, కేరింతలతో రెండు మ్యాచులూ క్రికెట్ సంబరాన్ని తలపించాయి.

అయితే అహ్మదాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మూడో టీ20 నుంచి స్టేడియంలో మ్యాచులు వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించేది లేదని నిర్ణయం తీసుకుంది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. మూడో, నాలుగో టీ20 ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో జరగగా, ఐదో టీ20 కూడా ఇలాగే జరగనుంది.

అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో కొందరు ప్రత్యేక అతిథులు మాత్రం దర్జాగా కూర్చొని, నాలుగో టీ20ని ఎంజాయ్ చేశారు. ఎవరా... అనుకుంటున్నారా... వానరాలు!

భారీ స్టేడియం, ప్రేక్షకులు లేకుండా విలవిలలాడుతుండడంతో కొన్ని వానరాలు, అక్కడికి వచ్చాయి. అందులో కొన్ని ఠీవీగా కూర్చుని, మ్యాచ్ వీక్షించడం కెమెరాలకు చిక్కింది...

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !