ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్... త్వరలోనే వస్తానంటూ...

By team teluguFirst Published Mar 19, 2021, 11:19 AM IST
Highlights

వీడియో సందేశం ద్వారా భారత ప్రధానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్... 

నిన్న వీడియో సందేశం ద్వారా థ్యాంక్స్ చెప్పిన ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్...

జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్‌ను పంపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా నియంత్రణ కోసం 50 వేల కోవిద్-19 వ్యాక్సిన్‌లను జమైకాకి పంపించింది భారత ప్రభుత్వం.

ఈ సాయంపై వీడియో సందేశం ద్వారా స్పందించిన క్రిస్‌గేల్... ‘గౌరవనీయులైన భారత ప్రధానికి, భారత ప్రజలకు, ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. జమైకాకి కరోనా వ్యాక్సిన్‌ను విరాళంగా ఇవ్వడాన్ని మేం ఎప్పుడూ మరిచిపోం... త్వరలోనే ఇండియాకి వస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Cricketer thanks PM Narendra Modi and the Government of India for sending COVID-19 vaccines to Jamaica. pic.twitter.com/YZHI7S3IOK

— Asianet Newsable (@AsianetNewsEN)

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు క్రిస్‌గేల్. 

click me!