డ్యాన్స్ తో అదరగొట్టిన స్మృతీ మంథనా.. వీడియో వైరల్..!

Published : Oct 21, 2021, 09:30 AM IST
డ్యాన్స్ తో అదరగొట్టిన స్మృతీ మంథనా.. వీడియో వైరల్..!

సారాంశం

స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్మృతి ఇన్ డా ఘెట్టో' అనే వైరల్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఆమెతో పాటు పలువురు స్నేహితులు కూడా అందులో ఉన్నారు.  


క్రికెటర్లంతా.. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా.. వారికి కూడా ఇతర సరదాలు ఉంటాయి. మన టీమిండియా క్రికెటర్లు ఇప్పటి వరకు చాలా మంది తమలో ఉన్న ఇతర టాలెంట్స్ ని చాలా సార్లు బయటపెట్టారు. తాజాగా.. టీమిండియా మహిళా జట్టు క్రికెటర్  స్మృతి మంథానా ( Smriti Mandhana) తన స్పెషల్ టాలెంట్ బయట పెట్టారు.

స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్మృతి ఇన్ డా ఘెట్టో' అనే వైరల్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఆమెతో పాటు పలువురు స్నేహితులు కూడా అందులో ఉన్నారు.

ఆమె డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్మృతీ మంధానతోపాటు.. ఆమె స్నేహితులు, టీమిండియా మహిళ జట్టు క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్ కూడా ఉండటం గమనార్హం. వారంతా డ్యాన్స్ సూపర్ గా వేశారు.

 

ఈ వీడియో షేర్ చేసిన మంథన.. వీడియో చేయాలనే ఆలోచన అయితే.. తనది కాదంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఎవరూ జడ్జ్ చేయవద్దని.. తనతో బలవంతంగా ఈ వీడియో చేయించారంటూ ఆమె క్యాప్షన్ లో పేర్కొనడం విశేషం. అయితే.. ఆమె క్యాప్షన్ కి.. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ ఫన్నీ కామెంట్ చేశారు. ఇది కచ్చితంగా స్మృతీ మంథనా ఐడియానే అయ్యి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు.. బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉండటం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

Yashasvi Jaiswal : విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్‌ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్
Yashasvi Jaiswal: 2027 వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?