సీపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ని చిత్తు చేసిన గుయానా అమేజాన్ వారియర్స్... మొట్టమొదటి టైటిల్ కైవసం..
30 ఏళ్లకే క్రికెట్‌కి రిటైర్మెంట్ చెబుతున్న రోజుల్లో 44 ఏళ్ల ఇమ్రాన్ తాహీర్, కెప్టెన్‌గా కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచి... అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సీపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ని చిత్తు చేసిన గుయానా అమేజాన్ వారియర్స్... టైటిల్ కైవసం చేసుకుంది. టీ20 టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ఇమ్రాన్ తాహీర్, ధోనీ (41 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2023)ని వెనక్కినెట్టేశాడు..
గుయానాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, 18.1 ఓవర్లలో 94 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వాల్టన్ 10, మార్క్ డేయల్ 16, కెసీ కార్టీ 38 పరుగులు చేశారు. నికోలస్ పూరన్ 1, అకీల్ హుస్సేన్ 1, ఆండ్రే రస్సెల్ 3, డీజే బ్రావో 8, సునీల్ నరైన్ 1, అలీ ఖాన్ 1, వకార్ సలామ్‌కీల్ 1 పరుగులు చేయగా కెప్టెన్ కిరన్ పోలార్డ్ డకౌట్ అయ్యాడు..
undefined
డ్వేన్ ప్రిటోరియస్ 4 వకెట్లు తీయగా గుడకేశ్ మోటీ, ఇమ్రాన్ తాహీర్ రెండేసి వికెట్లు తీశారు. 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి ఛేదించింది గుయానా అమెజాన్ వారియర్స్. కీమో పాల్ 11 పరుగులు చేయగా సయీమ్ ఆయుబ్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్తో 52 పరుగులు చేశాడు. షాయ్ హోప్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు..
WARRIORS ARE CHAMPIONS OF THE CPL 2023 🎉
Incredible scenes as Ayub wins it with a 6️⃣ - Republic Bank Play of the Day 💥 pic.twitter.com/CHq7bJMiCV
‘సీపీఎల్ టైటిల్ గెలవడం చాలా గొప్ప ఫీలింగ్. నేను కెప్టెన్ అయ్యాక అందరూ నాపైన జోక్స్ వేశారు. నిజానికి అదే నన్ను మోటివేట్ చేసింది. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది. నా అనాలసిస్ట్ ప్రసన్న, మా కోసం రోజుకి 20 గంటలు పని చేశాడు...
అలాగే ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కి థ్యాంక్స్. ఈ టోర్నీ ఆరంభానికి ముందే మేం గెలవగలమని అతను చెప్పాడు. అది మాలో ఉత్సాహం, నమ్మకం నింపింది..’ అంటూ చెప్పుకొచ్చాడు వారియర్స్ కెప్టెన్ ఇమ్రాన్ తాహీర్..