IPL: వైరల్ అవుతోన్న పంత్, గిల్ షేక్ హ్యాండ్ వ్యవహారం.. అంత అవసరమా అంటూ

Published : May 23, 2025, 02:27 PM IST
IPL: వైరల్ అవుతోన్న పంత్, గిల్ షేక్ హ్యాండ్ వ్యవహారం.. అంత అవసరమా అంటూ

సారాంశం

గుజరాత్ టైటాన్స్ ఓటమి అనంతరం. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మధ్య హ్యాండ్‌షేక్  వ్యవహారం నెట్టింట చర్చకు దారి తీసింది. 

గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మే 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. షారుఖ్ ఖాన్ (57), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (38) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా, నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించినా జట్టు 20 ఓవర్లలో 202/9కే పరిమితమైంది. 

16వ ఓవర్లో రూథర్‌ఫోర్డ్ ఔటైన తర్వాత, 182/4తో ఉన్న టైటాన్స్ బ్యాటింగ్ కుప్పకూలింది. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. లక్నో బౌలర్లలో విలియం ఓ'రౌర్కే 4 ఓవర్లలో 3/27 తీసుకున్నాడు. అవేష్ ఖాన్, ఆయుష్ బదోని చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆకాష్ సింగ్ మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

గిల్-పంత్ హ్యాండ్‌షేక్ వివాదం

మ్యాచ్ అనంతరం గిల్, పంత్ మధ్య జరిగిన హ్యాండ్‌షేక్ వైరల్ అయ్యింది. ఐపీఎల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో, పంత్ ఏదో మాట్లాడదామనుకుంటుండగా గిల్ త్వరగా వెళ్లిపోయినట్లు కనిపించింది. దీంతో గిల్ ఉద్దేశపూర్వకంగా పంత్‌ను పట్టించుకోలేదని నెటిజన్లు భావించారు. మరికొందరు మాత్రం గిల్‌కు పంత్ మాటలు వినిపించి ఉండకపోవచ్చని లేదా అందరికీ త్వరగా హ్యాండ్‌షేక్ ఇవ్వడంలో భాగంగా ఇలా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

 

నెటిజన్ల స్పందనలు

ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గిల్, పంత్ మధ్య ఎలాంటి వివాదం లేదని, ఇద్దరూ మైదానంలో, బయటా మంచి స్నేహితులని, ఇది కేవలం అపార్థమే అయ్యుంటుందని కొందరు అంటున్నారు. 

గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉంది?

ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది విజయాలు, నాలుగు ఓటములతో 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానంలో నిలవాలని టైటాన్స్ భావిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా పోటీలో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే, గుజరాత్ టైటాన్స్ మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది.

 

 

 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు